Penpahad : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆర్డీవో ఆకస్మిక తనిఖీ..!
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సూర్యాపేట రెవెన్యూ డివిజనల్ అధికారి వేణు మాధవరావు పరిశీలించారు.

Penpahad : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆర్డీవో ఆకస్మిక తనిఖీ..!
పెన్ పహాడ్, మన సాక్షి:
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సూర్యాపేట రెవెన్యూ డివిజనల్ అధికారి వేణు మాధవరావు శుక్రవారం మండలంలోని పెన్ పహాడ్ లో పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం, మాచారంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అనాజిపురం ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అనంతారం పిఎసిఎస్, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తాసిల్దార్ రాజశేఖర్ రెడ్డి తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించినారు.
ఈ సందర్భంగా ఆర్డీవో వేణుమాధవరావు మాట్లాడుతూ ధాన్యం కాంటాలలో వేగవంతం పెంచాలని, రైతులకు ఇబ్బంది పెట్టకుండా కాంటాలు వేయాలని, ధాన్యం కాంటాలు తప్పుడు తూకాలు వేసిన, రికార్డులు సక్రమంగా లేకపోయినా, ఎటువంటి అక్రమాలకు పాల్పడిన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన అన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు.
కొన్ని ధాన్యం కొనుగోలు సెంటర్లలో ధాన్యం కాంటాలు ప్రారంభించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా తేమశాతం పట్టి కాంటాలు వేసి ఎగుమతి చేయాలని ఆయన అధికారులను ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ రంజిత్ రెడ్డి, ఏఈఓ శ్రావణి, వివిధ గ్రామాల సీఈఓ లు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









