Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : కూకట్ పల్లిలో ప్రైవేట్ బస్సు దగ్ధం.. డ్రైవర్ అప్రమత్తం..!

హైదరాబాదు లోని కూకట్పల్లిలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు దగ్ధమైంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మెట్రో పిల్లర్ నెంబర్ 734 వద్ద దుర్గ మల్లేశ్వరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.

Hyderabad : కూకట్ పల్లిలో ప్రైవేట్ బస్సు దగ్ధం.. డ్రైవర్ అప్రమత్తం..!

మన సాక్షి, హైదరాబాద్ :

హైదరాబాదు లోని కూకట్పల్లిలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు దగ్ధమైంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మెట్రో పిల్లర్ నెంబర్ 734 వద్ద దుర్గ మల్లేశ్వరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ బస్సు గచ్చిబౌలి నుండి పాలకొల్లుకు బయలుదేరింది. కొండాపూర్, మియాపూర్ మీదుగా కెపిహెచ్బి చేరుకునే వరకు మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను వెంటనే దించి వేశాడు.

ఆ సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా మంటలు ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. డ్రైవర్ అప్రమత్తత వల్ల ఎలాంటి ప్రాణహాని జరగలేదు. బస్సు ఎక్కువ భాగం కాలిపోయింది. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు