Nalgonda : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం..!
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయి అని, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని నల్గొండ డిఎస్పీ కే.శివరాం రెడ్డి అన్నారు

Nalgonda : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం..!
నల్గొండ, మన సాక్షి.
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయి అని, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని నల్గొండ డిఎస్పీ కే.శివరాం రెడ్డి అన్నారు.
గురువారం నల్గొండ మండల పరిధిలోని కాజీరామారం గ్రామంలో గ్రామస్థుల సహకారంతో రూ.1.30 లక్షలతో 10 సీసీ కెమెరాలు తిప్పర్తి ఎస్సై వి.శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా నల్గొండ డిఎస్పీకే శివరాం రెడ్డి, హాజరై గ్రామ సర్పంచ్ సల్వాది సైదులు, గ్రామ కార్యదర్శి రాజేశ్వరి, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, జీనేక్స్ సీడ్స్ కంపెనీ డైరెక్టర్ సుంకరి వెంకటేశ్వర్లు గౌడ్ ,ఉప సర్పంచ్ సుంకరి సుమలత మోహన్ రావు, వార్డు సభ్యులు, గ్రామ టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు , ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరని, ఇప్పటికే పలు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేరం జరిగినపుడు దాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, పెద్ద పెద్ద నేరాలను కూడా సీసీ కెమెరాల ద్వారా గుర్తించవచ్చని తెలిపారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలంరినీ ఈ సందర్భంగా అభినందించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత:
సిసీ కెమెరాల ప్రారంభ సమావేశం అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే ప్రమాదాలు జరిగి మరణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే లాగా ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలను డీఎస్పీ కోరగా నల్గొండ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు, జీనేక్స్ సీడ్స్ కంపెనీ డైరెక్టర్ సుంకర వెంకటేశ్వర్లు గౌడ్ స్పందించి త్వరలోనే గ్రామ సర్పంచ్ గ్రామ ముఖ్య నాయకుల అందరితో కలిసి గ్రామంలో ప్రతి ఒక్కరికి హెల్మెట్ అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం పోలీసు అధికారులను గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, జీనేక్స్ సీడ్స్ కంపెనీ డైరెక్టర్ సుంకరి వెంకటేశ్వర్లు గౌడ్ , గ్రామ సర్పంచ్ ప్రజా ప్రతినిధులతో కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సుంకరి శ్రీనివాస్, పాలకూరి యాదయ్య, దండంపల్లి సైదులు, పాలకూరి దశరథ, గ్రామ రేషన్ డీలర్ దండంపల్లి రవికుమార్ గౌడ్ ,దొనకొండ రవికుమార్, నకరికంటి సైదులు, బుల్లెదు రమేష్, వార్డు సభ్యులు గ్రామస్తులు , తదితరులు పాల్గొన్నారు.









