Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Breaking : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఇరువురికి తీవ్ర గాయాలు..!

Breaking : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఇరువురికి తీవ్ర గాయాలు..!

చింతపల్లి, మన సాక్షి :

హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ, కారు, ఢీ కొన్న సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇరువురికి తీవ్ర గాయాలైన సంఘటన నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని ధైర్యపురి తండా గ్రామపంచాయతీ పరిధిలో గల దేవల తండా సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. సంఘటన విషయం తెలుసుకున్న చింతపల్లి పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. తీవ్ర గాయాలైన మరో ఇరువురు వ్యక్తులను హైదరాబాదులోని ఆసుపత్రికి తరలించారు. జరిగిన సంఘటన విషయం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు