Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. అక్కను హత్య చేసిన తమ్ముడు..!

సూర్యాపేట జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో ఆస్తి తగాదాల కారణంగా అక్కను సొంత తమ్ముడే దారుణంగా హత్య చేశాడు.

Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. అక్కను హత్య చేసిన తమ్ముడు..!

సూర్యాపేట, మన సాక్షి :

సూర్యాపేట జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామంలో ఆస్తి తగాదాల కారణంగా అక్కను సొంత తమ్ముడే దారుణంగా హత్య చేశాడు. ఆస్తికోసం ఇంత దారుణానికి పాల్పడ్డాడని అంటున్న గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సురుగు అంజమ్మ భర్త చనిపోవడంతో పిల్లలు లేకపోగా అమ్మగారి ఊరైన తుమ్మల పెనపహాడ్ లో తన చెల్లెలు వద్ద ఉంటుంది.

ALSO READ : Suryapet : సూర్యాపేట పోలీసుల కార్డన్ సెర్చ్ లో సంచలనం.. నలుగురు అనుమానితుల గుర్తింపు. 65 వాహనాలు, 10 ఆటోలు సీజ్..!

తన పేరు మీద ఉన్న రెండు ఎకరాల భూమిని చెల్లెలుకు ఇస్తానని అనడంతో అక్క తమ్ముడు మధ్య వివాదం కొంతకాలంగా కొనసాగుతుంది. దాంతో కోపం పెంచుకున్న తమ్ముడు అక్కను చంపితేనే తనకు ఆస్తి వస్తుందని దురుద్దేశంతో హత్యకు ప్లాన్ చేశాడు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం అక్క సురుగు అంజమ్మ పనికి వెళ్తుండగా తమ్ముడు కత్తి తో పొడిచి దారుణంగా హత్య చేశాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ALSO READ : Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. బావిలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి..! 

మరిన్ని వార్తలు