Suryapet : సూర్యాపేట పోలీసుల కార్డన్ సెర్చ్ లో సంచలనం.. నలుగురు అనుమానితుల గుర్తింపు. 65 వాహనాలు, 10 ఆటోలు సీజ్..!
శాంతి భద్రతల పరిరక్షణ కోసం, అనుమానిత వ్యక్తుల కదలికల నిర్మూలన, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన కోసం పోలీస్ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపారు.

Suryapet : సూర్యాపేట పోలీసుల కార్డన్ సెర్చ్ లో సంచలనం.. నలుగురు అనుమానితుల గుర్తింపు. 65 వాహనాలు, 10 ఆటోలు సీజ్..!
సూర్యాపేట, మనసాక్షి :
శాంతి భద్రతల పరిరక్షణ కోసం, అనుమానిత వ్యక్తుల కదలికల నిర్మూలన, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన కోసం పోలీస్ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ తెలిపారు. సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి సుందరయ్య నగర్ కాలనీ నందు ఆదివారం తెల్లవారు జామున పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు..
ఈ సందర్బంగా కాలనీలో ఉన్న ప్రతి ఇంటిని తనిఖీ చేశారు.ఈ తనిఖీలలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, ఇతర రాష్ట్రాలకు ఇతర ప్రాంతాలకు చెందిన నేరస్తులు షెల్టర్ తీసుకున్నారా, దొంగతనాలకు గురైన వాహనాలు ఏమైనా ఉన్నాయా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే అంశాలపై నిఘా ఉంచి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల నందు సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య పట్టణ ఎస్సై ల ఆధ్వర్యంలో 80 మంది సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సూర్యాపేట డిఎస్పి స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన భద్రత రక్షణ కల్పించడం, సమాజంలో శాంతిభద్రతలను కాపాడడంలో భాగంగా ఎస్పి నరసింహ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ అనుక్షణం పనిచేస్తుందని దీనిలో భాగంగానే ఈ కాలనీ నందు ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. కాలనీలోకి ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వచ్చినట్లయితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇతర రాష్ట్రాల నుండి ఇతర ప్రాంతాల నుండి వచ్చి షెల్టర్ పొంది నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నది కావున అలాంటి వారికి ఇండ్లు అద్దెకు ఇవ్వకూడదని పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి వాహనానికి అనుమతి పత్రం కలిగి ఉండాలని కోరారు. వాహనదారులు ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించాలని ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు..
ప్రస్తుత సమాజంలో గాంజా లాంటి మాదకద్రవ్యం మన యువతని పట్టిపీడిస్తుందని ఇలాంటి గంజాయిని మన కాలనీలోకి రానివ్వకూడదని గంజాయి సేవిస్తున్న వారు ఎవరైనా ఉన్నా గంజాయి సరఫరా చేసేవారు ఎవరైనా ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయికి అలవాటు పడిన వారిని సత్ప్రవర్తనకు తేవడం కోసం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ల ఆధ్వర్యంలో పునరావాస కేంద్రం ప్రభుత్వం ఆసుపత్రి నందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని పిల్లలను అభివృద్ధి పథంలో నడపడానికి ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలని సూచించారు. ఈ కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమంలో భాగంగా అనుమతి పత్రాలు లేనటువంటి నెంబర్ ప్లేట్లు లేనటువంటి సుమారు 60 ద్విచక్ర వాహనాలను, పది ఆటోలను సీజ్ చేయడం జరిగిందని సూచించారు.
అనుమానం ఉన్న వ్యక్తులను ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీలు చేయగా గతంలో నేరాలకు పాల్పడిన సుమారు నలుగురిని గుర్తించామని వీరి యొక్క వివరాలు తనిఖీ చేసి ప్రస్తుతం ఎలాంటి పనులు చేస్తున్నారని విచారించడం జరుగుతుందని తెలిపారు.
పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ ప్రజలు అందరూ కలిసిమెలిసి జీవించాలని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని కోరారు. రోడ్డు ప్రయాణ సమయంలో ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చు అని ప్రమాదాలను నివారించవచ్చని. గంజాయి లాంటి మత్తుపదార్థాలు పిల్లల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఆన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ఏడుకొండలు, మహేందర్ నాథ్, శివతేజ, ఐలయ్య, బాలు నాయక్, సైదిరెడ్డి, కనకరత్నం, వెంకన్న, ఏఎస్ఐలు నరేందర్ రెడ్డి ముత్తయ్య, వెంకన్న, స్పెషల్ పార్టీ సిబ్బంది, పట్టణ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










