అమృతాంజన్ వ్యాపార విస్తరణ.. పర్సనల్ గ్రూమింగ్ రంగంలోకి ప్రవేశం.. కొత్త ఉత్పత్తుల విడుదల
భారతీయ వెల్‌నెస్ రంగంలో ప్రముఖ బ్రాండ్ అయిన అమృతాంజన్ హెల్త్‌కేర్ సరికొత్త విభాగాల్లోకి అడుగుపెట్టింది

భారతీయ వెల్‌నెస్ రంగంలో ప్రముఖ బ్రాండ్ అయిన అమృతాంజన్ హెల్త్‌కేర్ సరికొత్త విభాగాల్లోకి అడుగుపెట్టింది. మహిళల పర్సనల్ కేర్ కోసం చౌకైన ధరలలో ‘కాంఫీ’ రేజర్లను విడుదల చేయడంతో పాటు, కీళ్ల నొప్పుల నివారణకు క్లినికల్ పరీక్షలు పూర్తి చేసుకున్న ‘ఆర్థో ఆయిల్’ను సంస్థ మార్కెట్లోకి తీసుకువచ్చింది. శతాబ్ద కాలపు నమ్మకమైన వారసత్వాన్ని కొనసాగిస్తూనే, సామాన్యులకు సైతం నాణ్యమైన పరిష్కారాలను అందించడమే ఈ విస్తరణ ముఖ్య ఉద్దేశం.
శతాబ్ద కాలానికి పైగా పెయిన్ మేనేజ్‌మెంట్‌లో నమ్మకమైన బ్రాండ్‌గా నిలిచిన అమృతాంజన్ హెల్త్‌కేర్, పర్సనల్ కేర్ అడ్వాన్స్‌డ్ వెల్‌నెస్ రంగంలోకి అడుగుపెడుతూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. మహిళల వ్యక్తిగత సంరక్షణ కోసం ప్రత్యేకంగా ‘కాంఫీ’ రేజర్ల శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది.
దీనితో పాటు వయస్సు రీత్యా వచ్చే కీళ్ల నొప్పులు, కండరాల బిగుతు నుండి ఉపశమనం అందించేందుకు క్లినికల్ పరీక్షలు పూర్తి చేసుకున్న ‘ఆర్థో ఆయిల్’ను కూడా సంస్థ పరిచయం చేసింది. ఈ నూతన ఉత్పత్తుల ద్వారా రోజువారీ వెల్‌నెస్ విభాగంలో తమ ఉనికిని మరింత పటిష్టం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది.
కాంఫీ బ్రాండ్‌తో మహిళల కోసం ప్రత్యేక రేజర్లు
మహిళల పర్సనల్ కేర్‌ను మరింత సులభతరం చేసేందుకు “పవర్ టు బి యు” అనే నినాదంతో కాంఫీ రేజర్లను డిజైన్ చేశారు. ప్రస్తుతం మార్కెట్లో మహిళల కోసం సరసమైన ధరల్లో నాణ్యమైన రేజర్లు లభించకపోవడం వల్ల చాలా మంది పురుషుల రేజర్లను వాడుతున్నారు. ఈ సమస్యను అధిగమిస్తూ భారతదేశంలోనే అత్యంత తక్కువ ధరకే లభించేలా 20 రూపాయలకే ‘క్లోజ్ అండ్ క్లీన్’ రేజర్‌ను సంస్థ తీసుకువచ్చింది. అలాగే మాస్-ప్రీమియం వెర్షన్ అయిన ‘సిల్కీ స్మూత్’ రేజర్‌ను కేవలం 50 రూపాయలకే అందిస్తోంది. మార్కెట్లోని ఇతర బ్రాండ్లతో పోలిస్తే ఈ ధర దాదాపు సగం మాత్రమే కావడం విశేషం. ఈ ఉత్పత్తుల నాణ్యతలో ఉన్నత ప్రమాణాల కోసం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దక్షిణ కొరియా సంస్థ ‘డోర్కో’ (Dorco) నుండి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు.
శారీరక నొప్పుల నివారణకు ఆర్థో ఆయిల్
పర్సనల్ కేర్ విభాగంతో పాటు తమ ప్రధాన రంగమైన పెయిన్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అమృతాంజన్ సరికొత్త ఆర్థో ఆయిల్‌ను రంగంలోకి దించింది. ఒంటి నొప్పులు, కండరాల బిగుతు కీళ్ల అసౌకర్యం నుండి ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. సహజసిద్ధమైన మూలికల మిశ్రమంతో, క్లినికల్ అధ్యయనాల ఆధారంగా ఈ ఆయిల్‌ను అభివృద్ధి చేశారు. దీనిని క్రమం తప్పకుండా వాడటం వల్ల నొప్పులు గణనీయంగా తగ్గుతాయని పరీక్షల్లో నిరూపితమైంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి ఒత్తిడి కారణంగా శారీరక ఇబ్బందులు ఎదుర్కొనే 45 నుండి 60 సంవత్సరాల వయస్సు గల వారికి ఈ ఆర్థో ఆయిల్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ తాజా పరిణామాలపై అమృతాంజన్ హెల్త్‌కేర్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. శంభు ప్రసాద్ మాట్లాడుతూ, తాము కేవలం పెయిన్ మేనేజ్‌మెంట్‌కే పరిమితం కాకుండా ప్రజల దైనందిన జీవితంలో నమ్మకమైన వెల్‌నెస్ భాగస్వామిగా ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాంఫీ రేజర్లు ఆర్థో ఆయిల్ వంటి నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా వినియోగదారులు ఆత్మవిశ్వాసంతో కదలడానికి, ప్రతిరోజూ సౌకర్యవంతంగా జీవించడానికి తాము తోడ్పడుతున్నామని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాల నమ్మకాన్ని కాపాడుకుంటూ అమృతాంజన్ సాగిస్తున్న ఈ ప్రయాణం భారతీయ వినియోగదారులకు మరింత మేలు చేయనుంది.






