Nalgonda : నల్గొండ జిల్లాలో పాఠశాలల పున ప్రారంభం రోజే అపశృతి.. విద్యార్థికి విద్యుత్ షాక్..!
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల పున ప్రారంభం మొదటి రోజే విద్యార్థి విద్యుత్ ఘాతానికి గురి కావడం స్థానికులను కలిసి వేసింది. సోమవారం మొదటి రోజు పాఠశాల ప్రారంభం కావడంతో ఉపాధ్యాయులు పాఠశాల గేటు వద్ద మామిడి తోరణాలు కట్టేందుకు సిద్ధమయ్యారు.

Nalgonda : నల్గొండ జిల్లాలో పాఠశాలల పున ప్రారంభం రోజే అపశృతి.. విద్యార్థికి విద్యుత్ షాక్..!
చింతపల్లి, మనసాక్షి :
తెలంగాణలో పాఠశాలల పున ప్రారంభం రోజే అపశృతి చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల పున ప్రారంభం మొదటి రోజే విద్యార్థి విద్యుత్ ఘాతానికి గురి కావడం స్థానికులను కలిచి వేసింది. సోమవారం మొదటి రోజు పాఠశాల ప్రారంభం కావడంతో ఉపాధ్యాయులు పాఠశాల గేటు వద్ద మామిడి తోరణాలు కట్టేందుకు సిద్ధమయ్యారు.
అదే సమయంలో సహాయం కోసం పక్కనే ఆడుకుంటున్న 8 వ తరగతి చదువు తున్నటువంటి నాంపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన జ్యోతి, శంకర్ ల కుమారుడు రామ్ చరణ్( 13 ) సంవత్సరాలు ఉపాధ్యాయుడు శ్రీధర్ పిలవగానే ఆ విద్యార్థి గేటు ఎక్కి మామిడి తోరణాలు కడుతుండగా పక్కన ఉన్న కరెంటు తీగ పట్టుకోవడంతో విద్యార్థి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు.
దీంతో విద్యార్థి అపస్మారక స్థితిలో పడిపోయాడు వెంటనే గమనించిన ఉపాధ్యాయులు . విద్యార్థిని దేవరకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాఠశాల ప్రారంభ మొదటిరోజు అపశృతి చోటు చేసుకోవడం తో బాలుని తల్లిదండ్రులు స్థానికులు తీవ్ర దిగ్భ్రాంది వ్యక్తం చేశారు.
కొండ మల్లెపల్లి లోని పాఠశాలలో విద్యార్థి విద్యుత్ షాక్ కి గురి ఆయన విషయాన్ని తెలుసుకున్న బిఆర్ఎస్వీ విద్యార్థి సంఘ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, సంజీవ ఆసుపత్రిలో విద్యుత్ షాక్ తో చికిత్స పొందుతున్న రామ్ చరణ్ ను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ కి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లును వారు కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్వీ నాయకులు జమీర్ బాబా, అనిల్ తదితరులు ఉన్నారు.









