Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Hyderabad : ఓటర్ల జాబితా సవరణపై బీజేపీ అవగాహన సదస్సు..!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ ఐ ఆర్) కార్యక్రమంపై శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్లు,( బి ఎల్ ఏ)నాయకుల విస్తృత స్థాయి సమావేశం గురువారం చందానగర్‌లోని క్రిస్టల్ గార్డెన్స్‌లో జరిగింది.

Hyderabad : ఓటర్ల జాబితా సవరణపై బీజేపీ అవగాహన సదస్సు..!

శేరిలింగంపల్లి, మన సాక్షి:

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ ఐ ఆర్) కార్యక్రమంపై శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్లు,( బి ఎల్ ఏ)నాయకుల విస్తృత స్థాయి సమావేశం గురువారం చందానగర్‌లోని క్రిస్టల్ గార్డెన్స్‌లో జరిగింది.

సమావేశంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్యూమరేషన్ ఫామ్‌లు, ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. బి.ఎల్.ఏలు ప్రతిరోజూ బి.ఎల్.ఓలతో కలిసి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని సూచించారు.

బీజేపీ రాష్ట్ర నాయకులు మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ గేటెడ్ కమ్యూనిటీలలో బూత్‌ల ఏర్పాటుకు కృషి చేయాలని, యాప్ ద్వారా వివరాలు సులువుగా నమోదు చేయవచ్చని తెలిపారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుత నెల రోజుల పాటు జరిగే ఇంటింటి సర్వే నివేదికలను ప్రతిరోజూ నాయకులకు అందజేయాలన్నారు.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నాయకులకు ఈ సర్వే ఒక సువర్ణ అవకాశమన్నారు. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లను తొలగించి, ఒకే కుటుంబానికి చెందిన ఓట్లన్నీ ఒకే బూత్‌ పరిధిలోకి వచ్చేలా చూడాలన్నారు.

ప్రతిరోజూ ఫామ్ 6, 7, 8 ల వివరాలను సేకరించాలని, క్షేత్రస్థాయిలో బి.ఎల్.ఏలకు పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు రవీందర్ రావు, అజిత్, ప్రభాకర్ యాదవ్, పద్మ, హనుమంత్ నాయక్, బల్దా అశోక్, మాణిక్ రావు, అనిల్ గౌడ్ మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు