Breaking Newsజాతరలుతెలంగాణ
Komuravelli Mallanna : కొబ్బరికాయలు అమ్ముకుంటే రూ.48.50 లక్షలు, కొబ్బరి ముక్కలు పోగు చేసుకుంటే రూ.75 లక్షలు.. మల్లన్నకు కోట్లల్లో ఆదాయం..!
కొమురవెల్లి మల్లన్న స్వామికి వేలంపాటలో కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వేలంపాట ద్వారా రూ. 2.64 కోట్ల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో కట్ట సుధాకర్ రెడ్డి తెలిపారు.

Komuravelli Mallanna : కొబ్బరికాయలు అమ్ముకుంటే రూ.48.50 లక్షలు, కొబ్బరి ముక్కలు పోగు చేసుకుంటే రూ.75 లక్షలు.. మల్లన్నకు కోట్లల్లో ఆదాయం..!
కొమురవెల్లి, మన సాక్షి
కొమురవెల్లి మల్లన్న స్వామికి వేలంపాటలో కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వేలంపాట ద్వారా రూ. 2.64 కోట్ల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో కట్ట సుధాకర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట సంతోషిమాత దేవాలయ ఈవో శ్రీధర్ రెడ్డి పర్యవేక్షణలో గురువారం పలు అంశాలకు సంబంధించిన వేలం పాటలు నిర్వహించారు.
కొమురవెల్లి మల్లన్న వద్ద కొబ్బరి కాయలు అమ్ముకుంటే రూ. 48.50 లక్షల రూపాయలకు కొమురవెల్లి కి చెందిన ఒక వ్యాపారి వేలపాట దక్కించుకున్నాడు. కాగా కొబ్బరి ముక్కలు పోగు చేసుకునేందుకు 75 లక్షల రూపాయలకు చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి చెందిన మరో వ్యాపారి వేలంపాటలో హక్కులు తగ్గించుకున్నారు. వేలంపాటలో ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్, శ్రీనివాస్ పర్యవేక్షకుడు నీల శేఖర్, సర్పంచ్ పద్మ పాల్గొన్నారు.
ఇతర వేలం సొమ్ము :
-
ఒడిబియ్యం, వస్త్రాలు పసుపు పోగు చేసుకొనుటకు 73.50 లక్షలు
-
కోరమీసాల విక్రయం 17.31 లక్షలు
-
పాదరక్షలు, బ్యాగులు భద్రపరుచుటకు 18 లక్షలు
-
శౌఛాలయం నిర్వహించుట 5.25 లక్షలు
-
రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఒడిబియ్యం, పసుపువస్త్రాలు పోగు చేసుకొనుటకు 23.30 లక్షలు
-
దుకాణ సముదాయం 3.13 లక్షలు









