Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. స్పాట్ లో ముగ్గురు మృతి..!
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్పాట్ లో ముగ్గురు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. స్పాట్ లో ముగ్గురు మృతి..!
నల్గొండ ప్రతినిధి, మన సాక్షి :
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్పాట్ లో ముగ్గురు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం రామన్నగూడెం స్టేజి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. దాంతో కార్లలో ఉన్న ముగ్గురు వ్యక్తులు స్పాట్ లో మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సంఘటన చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అదే విధంగా108కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :









