Breaking Newsతెలంగాణరాజకీయం
Rythu Bharosa : రైతులకు శుభవార్త.. 30న రైతు భరోసా నిధులు విడుదల..!
తెలంగాణలో రైతు భరోసా పథకం నిధులను ఈనెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. వానాకాలం సీజన్ రైతు భరోసాను ఆ రోజున విడుదల చేయనున్నారు.

Rythu Bharosa : రైతులకు శుభవార్త.. 30న రైతు భరోసా నిధులు విడుదల..!
హైదరాబాద్, మన సాక్షి :
తెలంగాణలో రైతు భరోసా పథకం నిధులను ఈనెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. వానాకాలం సీజన్ రైతు భరోసాను ఆ రోజున విడుదల చేయనున్నారు. 30వ తేదీన మధిర లో బహిరంగ సభ నిర్వహించి రైతుల ఖాతాలలో నిధులు జమ చేయనున్నారు. 73 లక్షల మంది రైతులకు 9000 కోట్ల రూపాయలను ఒకేసారి విడుదల చేయాలని ప్రభుత్వం కసరత్వం నిర్వహిస్తోంది.
గురువారం తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ అనధికార సమావేశంలో రైతు బరోసా పై నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా హైదరాబాదులోని మెట్రో రైలు, ధాన్యం కొనుగోళ్ల, కేంద్ర ప్రభుత్వ వైఖరి పై ఈ సమావేశంలో చర్చించారు.









