Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Paddy : ఇకపై రూ.500 బోనస్ ఆ వడ్లకే..!

తెలంగాణలో రైతులు సన్న రకాల వరి ధాన్యాన్ని వేటిని సాగు చేస్తే బోనస్ లభిస్తుందో ప్రభుత్వం తేల్చి చెప్పింది. మొత్తం సన్న రకాల వరి ధాన్యాలు 33 రకాలు ఉన్నాయి.

Paddy : ఇకపై రూ.500 బోనస్ ఆ వడ్లకే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతులు సన్న రకాల వరి ధాన్యాన్ని వేటిని సాగు చేస్తే బోనస్ లభిస్తుందో ప్రభుత్వం తేల్చి చెప్పింది. మొత్తం సన్న రకాల వరి ధాన్యాలు 33 రకాలు ఉన్నాయి. కాగా రైతులకు అధిక దిగుబడిని వచ్చే సన్న రకాల ధాన్యంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే విధంగా పండించే పంటలను ప్రభుత్వం గుర్తించింది. ఆ రకాల పంటలకే ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల ధాన్యంకు క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తుంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో వివిధ రకాల నేల సారాలను బట్టి 33 రకాల సన్నధాన్యాలను రైతులు పండిస్తున్నారు. కాగా కేవలం రెండు రకాల సన్నదాన్యం కు మాత్రమే బోనస్ చెల్లించనున్నారు. ఇకపై వానాకాలం సీజన్ నుంచి ఈ ఏడు రకాల సన్నధాన్యం పండించిన వారికి మాత్రమే ప్రభుత్వం బోనస్ చెల్లించనున్నది.

ఆ ఏడు రకాల వరి సన్న ధాన్యాలు :

ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. ఏడు రకాల వరి సన్నధాన్యాలలో బీపీటీ 52 04, (సంబమాసూరి ), ఆర్ ఎన్ ఆర్ -15048 (తెలంగాణ సోనా), హెచ్ఎంటి, జైశ్రీరామ్, కెఎన్ఎమ్ 1638 (కూనారం సన్నలు) డబ్ల్యు జి ఎల్ -44( సిద్ది), కెఎన్ఎమ్- 7715 రకాల ధాన్యం కు మాత్రమే ప్రభుత్వం బోనస్ చెల్లించే అవకాశాలు ఉన్నాయి.

రైతులు ఆచి తూచి సాగు :

వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే బోనస్ లభించే పంటలో తో పాటు అధిక దిగుబడులు, అధిక డిమాండ్ ఉన్న పంటలను ప్రభుత్వం ప్రకటించినందున రైతులు ఆచితూచి సాగు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం 33 రకాల సన్న రకాల ధాన్యం ఉన్నప్పటికీ అధిక ఆదాయం, అధిక డిమాండ్, లాభాలు వచ్చే పంటలను మాత్రమే రైతులు సాగు చేయాలి. ముందు చూపు లేకుండా రైతులు పంటలను సాగు చేస్తే విక్రయించే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

రైతులకు సంబంధించిన పూర్తి సమాచారం రైతు వేదికలలో అందించాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పంటలు సాగు చేసే ముందు రైతు వేదికలు సందర్శించి అధికారుల సలహాల మేరకు సాగు చేయాలి.

ఈ వార్తలు కూడా చదవండి : 

మరిన్ని వార్తలు