Vemulapally : డీసీఎం కంటైనర్ మీద పడి వ్యక్తి మృతి..!
అతివేగంతో కరెంటు పోలును ఢీ కొట్టి గాల్లోకి ఎగిరి ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తి పై పడడంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందిన సంఘటన వేములపల్లి మండలం బుగ్గబాయిగూడెం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Vemulapally : డీసీఎం కంటైనర్ మీద పడి వ్యక్తి మృతి..!
వేములపల్లి, మన సాక్షి :
అతివేగంతో కరెంటు పోలును ఢీ కొట్టి గాల్లోకి ఎగిరి ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తి పై పడడంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందిన సంఘటన వేములపల్లి మండలం బుగ్గబాయిగూడెం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోలేబోయిన వెంకన్న యాదవ్ (49) తన ఇంటి ముందు నిద్రిస్తున్న సమయంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో హైదరాబాదు నుండి ఆంధ్ర వైపు వెళుతున్న డిసిఎం కంటైనర్ అతివేగంతో వచ్చి నార్కట్పల్లి అద్దంకి రహదారి ప్రక్కన ఉన్న సిమెంటు కరెంటు పోలును ఢీకొట్టడంతో అమాంతం గాల్లోకి ఎగిరిన కంటైనర్ ఆరుబయట నిద్రిస్తున్న వెంకన్న పై పడిందన్నారు.
ఈ ప్రమాదంలో వెంకన్న కడుపు భాగం తల భాగం నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలను వదిలారు. మృతుడి భార్య పూలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా దావకానకు తరలించామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.