Kanagal : వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు..!
భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న ధర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

Kanagal : వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు..!
కనగల్ , మన సాక్షి:
భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న ధర్వేశిపురం (పర్వతగిరి)
శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటిరోజు తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలలో మంగళ వాయిద్యాల నడుమ వేదమంత్రాల ఘోష మారుమోగింది. సుప్రభాత సేవ, లలితా సహస్ర నామార్చన, బాలభోగ నివేదనతో జాతర ప్రారంభమైంది.
ఆలయ ప్రకార మండపంలో వేద పండితులు అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. దేవి మూల మంత్ర హోమములు, మహా నివేదన, గవ్యాంత పూజలు, నిత్య హోమములు, విగ్నేశ్వర పూజలు, అఖండ దీపారాధన, తీర్ధ ప్రసాద గోష్టి, చండీహోమం, బలిహరణ, అంకురార్పణ, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన, బలిహరణ, నీరాజన మంత్రపుష్పములు ఎదుర్కోళ్ళు మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు బుధవారం శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ – జమదగ్ని మహామునిల కళ్యాణం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కన్నుల పండుగ నిర్వహించనున్నారు. అమ్మవారి కళ్యాణానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరుకానున్నారు. అమ్మవారి కళ్యాణానికి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారి 24వ వార్షిక తిరుకళ్యాణ మహోత్సవమును భక్తులు తిలకించేందుకు అన్ని ప్రాంతాల నుంచి వేలాదిగా తరలిరానున్నారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్, ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, ఆలయ ఈవో అంబటి నాగిరెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ లు ముత్తయ్య, గోపాల్ రెడ్డి, యాదగిరి, ఆలయ అర్చకులు మల్లాచారి, శ్రవణ కుమారాచార్యులు, ఉమామహేశ్వరరావు, దామోదర్ రావు, ఆలయ ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది నాగేశ్వరరావు, ఉపేందర్ రెడ్డి, ఆంజనేయులు, నాగరాజు, శ్రీకర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.










