Nalgonda : జూలై 22న ఎన్.జి కళాశాల స్నాతకోత్సవం.. బంగారు పతకాల ప్రదానం..!
నల్గొండ లోని నాగార్జున ప్రభుత్వ కళాశాల స్నాతకోత్సవం మరియు బంగారు పతకాల ప్రదాన కార్యక్రమం జూలై 22న జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు.

Nalgonda : జూలై 22న ఎన్.జి కళాశాల స్నాతకోత్సవం.. బంగారు పతకాల ప్రదానం..!
నల్లగొండ, మన సాక్షి :
నల్గొండ లోని నాగార్జున ప్రభుత్వ కళాశాల స్నాతకోత్సవం మరియు బంగారు పతకాల ప్రదాన కార్యక్రమం జూలై 22న జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు, 2024-25 విద్యా సంవత్సరంలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ స్నాతకోత్సవానికి హాజరు కావడానికి అర్హులని ఆయన తెలిపారు.
అర్హులైన విద్యార్థులు స్వయంగా కళాశాల పనివేళల్లో కళాశాలకు వచ్చి, నిర్ణీత ఫీజును చెల్లించి స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి తెలిపారు. స్నాతకోత్సవానికి అర్హులైన విద్యార్థుల జాబితా ఇతర పూర్తి వివరాలు కళాశాల అధికారిక వెబ్‌సైట్ https://ngcollegenalgonda.ac.in లో చూడవచ్చని అన్నారు.
అర్హులైన విద్యార్థులందరూ నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకుని, స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు. ఇతర వివరాలకు 9550636464 నెంబర్ కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేయవచ్చని తెలిపారు.









