Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తుకు జూలై 5 ఆఖరు..!

ఖరీఫ్ సీజన్ 2026-27 సంవత్సరానికి రైతు భరోసా పథకానికి రైతులు దరఖాస్తులు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి హరీష్ పవర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తుకు జూలై 5 ఆఖరు..!

కంగ్టి, మన సాక్షి :

ఖరీఫ్ సీజన్ 2026-27 సంవత్సరానికి రైతు భరోసా పథకానికి రైతులు దరఖాస్తులు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి హరీష్ పవర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ నెల 15వ తేదీ లోపు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి అర్హులని పేర్కొన్నారు. రైతులు రైతు భరోసా ఫారం, పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ తో సంబంధిత క్లస్టర్ ఏఈవోలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. జులై 5లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతులు తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ సీడింగ్, ఇతర వివరాల్లో ఎలాంటి పొరపాట్లు ఉన్నా వెంటనే సరిచేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు