Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్

పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..!

అన్నమయ్య జిల్లా మండలంలోని పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధి కారి డాక్టర్ డి. ప్రత్యూష ప్రజలకు విజ్ఞప్తి చేశారు,

పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..!

రామసముద్రం, మనసాక్షి

అన్నమయ్య జిల్లా మండలంలోని పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధి కారి డాక్టర్ డి. ప్రత్యూష ప్రజలకు విజ్ఞప్తి చేశారు,

ఈ సందర్బంగా ఆమె శనివారం ప్రభుత్వ ఆసుపత్రి లో మాట్లాడుతూ నేడు ఆదివారం 26 పల్స్ పోలియో కేంద్రాలలో 3764 మంది పిల్లలకు వేయడం జరుగుతుందని, ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు,

కావున ప్రజలు ఈ కేంద్రాలలో పోలియో చుక్కలు వేయించడం చాలా మంచిదన్నారు, ఆరోజు ఇళ్లలో లేని పిల్లలకు, ఎక్కువ జ్వరం, విరోచనాలతో భాదపడుతున్న పిల్లలకు సోమవారం, మంగళవారం ప్రతి ఇంటిని సందర్శించి పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అన్నారు, కావున ప్రజలు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత మండలంగా మార్చాలన్నారు ఈ సమావేశంలో డాక్టర్ డి.ప్రత్యూష పి హెచ్ సి సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు