30 ఏళ్ల నమ్మకం.. రూ.50 కోట్లతో పరార్.. నిండా ముంచిన సిమెంట్ వ్యాపారి..!
30 ఏళ్ల పాటు ఉన్న నమ్మకాన్ని ఆసరా చేసుకుని 50 కోట్ల రూపాయలు వసూలు చేసి ఓ సిమెంట్ వ్యాపారి పరార్ అయ్యారు. బాధితుల కథనం ప్రకారం.

30 ఏళ్ల నమ్మకం.. రూ.50 కోట్లతో పరార్.. నిండా ముంచిన సిమెంట్ వ్యాపారి..!
మన సాక్షి, హైదరాబాద్ :
30 ఏళ్ల పాటు ఉన్న నమ్మకాన్ని ఆసరా చేసుకుని 50 కోట్ల రూపాయలు వసూలు చేసి ఓ సిమెంట్ వ్యాపారి పరార్ అయ్యారు. బాధితుల కథనం ప్రకారం.. హైదరాబాదులోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చక్రపురం, భగవాన్ కంపెనీలకు చెందిన పబ్బు చంద్రశేఖర్ స్థానికంగా శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్ పేరుతో సిమెంట్ వ్యాపారం చేసేవాడు. సుమారు 30 ఏళ్ల పాటు ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగుతున్నాడు. స్థానికంగా ఉంటూ అందరిని నమ్మించాడు.
తన కూతురుకు వివాహం కుదిరిందని, తండ్రి అనారోగ్యానికి చికిత్స చేయించాలని, భగవాన్ కాలనీలో కొత్తగా ఇల్లు నిర్మాణం చేస్తున్నానని, అదేవిధంగా సిమెంట్ కంపెనీల స్కీమ్స్ కు డిపాజిట్ ల కోసం డబ్బులు చెల్లించాలని ఈ విధంగా తెలిసిన వారిని నమ్మించాడు. అంతే కాకుండా మరి కొంత మంది వద్ద అధిక వడ్డీ ఇస్తానంటూ ఆశ చూపి డబ్బులు వసూలు చేశాడు.ఇలా 80 మంది నుంచి సుమారుగా 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాడు.
జూన్ 22వ తేదీన అతడు రెండు సెల్ ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ చేయగా రాత్రికి రాత్రి తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. అంతకుముందే తన కూతుర్లను తమ్ముడు ఇంట్లో వదిలిపెట్టి వచ్చాడు. బాధితులు కూతుళ్ళ గురించి వాకబ్ చేస్తే స్విట్జర్లాండ్ కు వెళ్లినట్లుగా తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. బాధితులు చంద్రశేఖర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతికి వినతిపత్రం అందజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని ఆమె ఇచ్చారు.









