Miryalaguda : మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం.. భార్య మృతి, భర్తకు గాయాలు..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నందిపాడు చౌరస్తాలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతిచెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

Miryalaguda : మిర్యాలగూడలో రోడ్డు ప్రమాదం.. భార్య మృతి, భర్తకు గాయాలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నందిపాడు చౌరస్తాలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతిచెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల ప్రకారం.. వాటర్ ట్యాంక్ తండాకు చెందిన కమ్లీ, సక్రు నందిపాడు చౌరస్తాలో ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతుండగా కంటైనర్ ఢీకొన్నది. దాంతో భార్య కమ్లి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త సక్రుకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. న్యాయం చేయాలని స్థానికులు ఆందోళన అద్దంకి నార్కట్ పల్లి రహదారి పై ధర్నా చేశారు. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన విరమించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని కమ్లీ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. అదేవిధంగా గాయాలైన సక్రుని ఆసుపత్రిలో ఆసుపత్రిలో పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.