Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : వాహన యజమానులకు సూర్యాపేట జిల్లా ఎస్పీ సీరియస్ హెచ్చరిక.. ఆ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు..!

జాతీయ రహదారులపై మరియు జిల్లాలోని ఇతర ప్రధాన రహదారుల వెంట నిబంధనలకు విరుద్ధంగా, ఎక్కడపడితే అక్కడ అనుమతిలేకుండా వాహనాలను నిలిపే వారిపై సూర్యాపేట జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటాం అని అలాగే వాహన యజమానులకు భారీ జరిమానా వీధిస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఒక ప్రకటన లో హెచ్చరించారు.

Suryapet : వాహన యజమానులకు సూర్యాపేట జిల్లా ఎస్పీ సీరియస్ హెచ్చరిక.. ఆ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు..!

సూర్యాపేట, మనసాక్షి :

జాతీయ రహదారులపై మరియు జిల్లాలోని ఇతర ప్రధాన రహదారుల వెంట నిబంధనలకు విరుద్ధంగా, ఎక్కడపడితే అక్కడ అనుమతిలేకుండా వాహనాలను నిలిపే వారిపై సూర్యాపేట జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటాం అని
అలాగే వాహన యజమానులకు భారీ జరిమానా వీధిస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఒక ప్రకటన లో హెచ్చరించారు.

నిబంధనలు ఉల్లంఘించిన లారీ యజమానులకు భారీగా జరిమానాలు విధిస్తున్నమని చెప్పారు.రహదారుల వెంట హోటల్స్, పంక్చర్ షాప్స్, టి దుకాణాలు ఇతర వ్యాపారాలు చేసేవారు బాధ్యతగా ఉండాలని జాగ్రత్తలు పాటించాలన్నారు.

రోడ్డు ప్రమాదాలకు కారణం:

రహదారుల పక్కన, సర్వీస్ రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు నిలపడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.

కఠిన చర్యలు:

హైవేలపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. నిబంధనలు పాటించకుండా వాహనాలు పార్క్ చేస్తే మోటార్ వాహనాల చట్టం ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.

పార్కింగ్ నియమాలు :

వాహనదారులు, లారీ డ్రైవర్లు ఇతర వాహనాలను కేవలం రోడ్డు కు దూరంగా నిలుపుకోవాలి. రహదారుల వెంట ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
“రోడ్డు ప్రమాద రహిత సూర్యాపేట జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని కోరారు.

MOST READ 

మరిన్ని వార్తలు