Breaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండవిద్య
Boxing : బాక్సింగ్ పోటీల్లో సెయింట్ జాన్స్ హై స్కూల్ విద్యార్థినికి రజత పతకం..!
తెలంగాణ అంతర్ పాఠశాల క్రీడా పోటీలు – 2026లో నిర్వహించిన బాక్సింగ్ పోటీల్లో మిర్యాలగూడ కు చెందిన సెయింట్ జాన్స్ హై స్కూల్ విద్యార్థిని ఎన్. దూహిత (III-B తరగతి) అండర్ -10 విభాగంలో రజత పతకం సాధించింది.

Boxing : బాక్సింగ్ పోటీల్లో సెయింట్ జాన్స్ హై స్కూల్ విద్యార్థినికి రజత పతకం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
తెలంగాణ అంతర్ పాఠశాల క్రీడా పోటీలు – 2026లో నిర్వహించిన బాక్సింగ్ పోటీల్లో మిర్యాలగూడ కు చెందిన సెయింట్ జాన్స్ హై స్కూల్ విద్యార్థిని ఎన్. దూహిత (III-B తరగతి) అండర్ -10 విభాగంలో రజత పతకం సాధించింది. ఈ పోటీలు ఈ నెల 25 న సారూర్నగర్ స్టేడియంలో నిర్వహించబడ్డాయి.
దూహిత అద్భుతమైన ప్రతిభను కనబరిచి రజత పతకం మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంది. ఈ సందర్భంగా సెయింట్ జాన్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ అలుగు బెల్లి శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ అలుగు బెల్లి శిరీష దూహితను హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము అన్నారు.
MOST VIEWS :









