Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్

షార్ట్ సర్క్యూట్ తో భవనం దగ్ధం.. బుగ్గిపాలైన రూ.12 లక్షలు..!

మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ముదిరాజ్ సంఘ భవనంలో నివాసం ఉంటున్న వారి 12 లక్షల డబ్బులు షార్ట్ సర్క్యూట్ కు దగ్ధమయ్యాయి

షార్ట్ సర్క్యూట్ తో భవనం దగ్ధం.. బుగ్గిపాలైన రూ.12 లక్షలు..!

మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి,
మన సాక్షి

మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండల్ తిరుమలాపూర్ గ్రామంలో సోమవారం ప్రమాద షార్ట్ సర్క్యూట్ తో ముదిరాజు భవనంలో నివసిస్తున్న అంజమెని పార్వతమ్మ, ముద్దుల వెంకటమ్మ, ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఇల్లు పనులు నిర్మాణం కొనసాగుతున్నందు వలన తిరుమలాపూర్ ముదిరాజు భవనంలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు.

సోమవారం మధ్యాహ్నం సమయంలో షార్ట్ సర్క్యూట్ తో అకస్మాత్తుగా మంటలు రావడంతో గమనించిన గ్రామస్తులు హాట్ హాట్ గా అగ్నిమాపకానికి ఫోను చేసి ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలు ఆరిపారు. భవనంలో 12 లక్షలు నగదు బంగారు నగలు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి గ్రామస్తులు తెలిపారు. నిరుపేదలైన అంజమ్మ, పార్వతము లను ఆర్థిక నష్టపరిహారం ప్రభుత్వమే ఆదుకోవాలని తిరుమలాపూర్ గ్రామ సర్పంచి సంతోష, వెంకటేష్ కోరారు.

ఇవి కూడా చదవండి 

మరిన్ని వార్తలు