Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలు

కరీంనగర్ లో గంజాయి విక్రయం గుట్టురట్టు..!

కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామ శివారులో గంజాయి విక్రయానికి సిద్ధమవుతున్న ఇద్దరిపై పోలీసులు దాడి చేసి, ఒకరిని అరెస్ట్ చేశారు.

కరీంనగర్ లో గంజాయి విక్రయం గుట్టురట్టు..!

కిలో 11 గ్రాములు గంజాయి స్వాధీనం

ఒకరు అరెస్ట్, మరొకరి కోసం గాలింపు

కరీంనగర్ బ్యూరో , మన సాక్షి :

కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామ శివారులో గంజాయి విక్రయానికి సిద్ధమవుతున్న ఇద్దరిపై పోలీసులు దాడి చేసి, ఒకరిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పోలీసులను చూసి పరారవడంతో అతడి కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ అనుముల నిరంజన్ రెడ్డి, ఎస్సై ఏ. లక్ష్మారెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి సమ్మక్క గద్దెల సమీపంలో తనిఖీలు నిర్వహించారు.

ఈ సమయంలో బైక్, బ్యాగుతో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించగా, ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి బెజ్జంకి ప్రేమ్‌కుమార్ (28)గా గుర్తించారు. అతడి వద్ద ఉన్న బ్యాగును పంచుల సమక్షంలో తనిఖీ చేయగా 1 కిలో 11 గ్రాముల గంజాయి లభ్యమైంది. గంజాయితో పాటు ఒక బైక్, మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ALSO READదుబాయ్‌లో ఆలూర్ వాసి మృతి.. స్వగృహానికి చేరిన మృతదేహం..! 

విచారణలో మరో వ్యక్తి కాశిపాక నవీన్ (23)తో కలిసి గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రేమ్‌కుమార్ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలం నుంచి తప్పించుకున్న నవీన్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోందన్నారు. నిందితుడు ప్రేమ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయి ఎక్కడి నుంచి సేకరించారు.

ALSO READMiryalaguda : మిర్యాలగూడలో బిఆర్ఎస్ భారీ నిరసన.. 420 హామీలపై 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన..!

ఎవరెవరికి విక్రయించారు అనే కోణంలో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై నిరంతరం నిఘా ఉంచి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కేసులో సమర్థవంతంగా విధులు నిర్వహించిన కరీంనగర్ రూరల్ పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్ అభినందించారు.

మరిన్ని వార్తలు