దుబాయ్లో ఆలూర్ వాసి మృతి.. స్వగృహానికి చేరిన మృతదేహం..!
ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన ఒక పేద కార్మికుడు అకస్మాత్తుగా గుండెపోటు రావడం అక్కడికక్కడే మరణించడంతో ఆలూర్ మండల కేంద్రంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

దుబాయ్లో ఆలూర్ వాసి మృతి.. స్వగృహానికి చేరిన మృతదేహం..!
ఆలూర్, మన సాక్షి
ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన ఒక పేద కార్మికుడు అకస్మాత్తుగా గుండెపోటు రావడం అక్కడికక్కడే మరణించడంతో ఆలూర్ మండల కేంద్రంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… ఆలూర్ మండల కేంద్రానికి చెందిన కచర్ల మోహన్ (40) గత పదేళ్లుగా దుబాయ్ వెళ్తూ,వస్తూ ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
కాగా ఆయన ఆగస్టు 4న రాత్రి అక్కడ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తి కావడంతో బుధవారం ఆయన భౌతికకాయం స్వగృహానికి చేరుకుంది.
ALSO READ : Gold Price : వరుసగా పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే..!
సొంతూరుకు చేరిన మృతదేహాన్ని చూసి భార్య కచర్ల రాణి, కుమారుడు గణేష్ సహా కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అత్యంత నిరుపేద కుటుంబానికి చెందిన మోహన్ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర శోకసంద్రం నెలకొంది. అనంతరం బంధువులు, గ్రామస్థుల సమక్షంలో అంత్యక్రియలు ముగిశాయి.









