Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలురాజకీయంసూర్యాపేట జిల్లా

కాంగ్రెస్ సంక్షేమ పాలనపై బి ఆర్ ఎస్ నిరసన హాస్యాస్పదం..!

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అలాంటి పాలనపై బిఆర్ఎస్ నిరసనలు వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు.

కాంగ్రెస్ సంక్షేమ పాలనపై బి ఆర్ ఎస్ నిరసన హాస్యాస్పదం..!

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట, మనసాక్షి :

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అలాంటి పాలనపై బిఆర్ఎస్ నిరసనలు వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సూర్యాపేట లోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల పౌర సరఫరా శాఖ మంత్రి వర్యులు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అద్భుతంగా మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకొని సంక్షేమ పాలన సాగిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని దిగిపోవాలని నిరసనలు చేయడం దేనికన్నారు. 25 లక్షల పైగా రైతు కుటుంబాలకు రెండు లక్షల వరకు రుణ మాఫీ కల్పించినందుకు, ఉచిత విద్యుత్తు రైతు సంక్షేమానికి 1. 72 లక్షల కోట్లు ఖర్చు చేసినందుకు ప్రజా ప్రభుత్వం దిగిపోవాలా అని ప్రశ్నించారు.

మహాలక్ష్మి పథకం ద్వారా రూ 12167 కోట్ల బస్సు చార్జీలు ఆదా కల్పించామని, గృహ జ్యోతి పథకం కింద 53 లక్షల పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించామని, 43 లక్షల కుటుంబాలకు 500 కే గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, మహిళా సంఘాలకు 60, 487 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఇచ్చి 1900ల కోట్ల వడ్డీ రాయితీ కల్పించామన్నారు. తొలి విడుతలో 4.50 లక్షల ఇందిర ఇండ్లు అందించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల చొప్పున గ్రేటర్ సిటీలో ఇందిరమ్మ టవర్స్ లక్షమందికి ఇందిరమ్మ ఇండ్లు కల్పించామని గుర్తు చేశారు.

ALSO READGold Price : వరుసగా పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే..!

72,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు మరో 7,437 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ కల్పించామని, 3.38 కోట్ల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం అందించడంతో పాటు 15.46 లక్షల కొత్త రేషన్ కార్డులు అందించామన్నారు.

2.25 లక్షల మందికి పెన్షన్లు, 22 లక్షల మంది విద్యార్థులకు రూ 720 కోట్లతో అల్పాహారం పోషకాహారం అందిస్తున్నామని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 5, 18, 180 మంది నిరుపేద రోగులకు 2,527 కోట్లు సాయం అందించామని, రిటైర్డ్ ఉద్యోగులకు వంద రోజుల్లో 6000 కోట్ల బకాయిలు చెల్లించామని, 2025-26లో ఐటి ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లు, 12.14 లక్షల ప్రత్యేక ఐటీ ఉద్యోగాలు కల్పించడంతో పాటు హైదరాబాదులో 355 గ్లోబల్ క్యాప్టబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేసినందుకు ఈ ప్రజా ప్రభుత్వం దిగిపోవాలా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధికి చిరునామాగా నిలిచిందనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. కెసిఆర్ కు ప్రతిపక్ష నాయకుడిగా నెలకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రశ్నించే ముందు పదేండ్ల మీ మ్యానిఫెస్టోలో ఏం చేశారో చెప్పాలన్నారు. మూడేళ్లలో కెసిఆర్ మూడుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని ఆయన ఏది చెప్పాలనుకున్న అసెంబ్లీకి వచ్చి చెప్పాలన్నారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ నాయకులు కేసిఆర్ ప్రతిపక్ష పాత్రను సక్రమంగా పోషించాలని కాదని ప్రజలను మభ్య పెట్టేందుకు రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేస్తే ప్రజా ప్రభుత్వం సహించదని ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

ఈ విలేకరుల సమావేశం లో కౌన్సిలర్ బైరు శైలెండర్, మాజీ సర్పంచ్ రామాసాని రమేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు శేనగాని రాంబాబు గౌడ్, కుందమల్ల శేఖర్,పందిరి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు