Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుమహబూబ్‌నగర్

రూ.39.4 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే యెన్నం శంకుస్థాపన..! 

పాలమూరు పట్టణ కేంద్రంలో 6/22 డివిజన్ ఏనుగొండలో ₹39.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నిర్మాణ పనులకు 22వ పద్మావతి కాలనీ వార్డులు 9.32 కోట్ల నిధులతో పనులకు శంకుస్థాపన చేశారు.

రూ.39.4 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే యెన్నం శంకుస్థాపన..! 

మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి, మన సాక్షి

పాలమూరు పట్టణ కేంద్రంలో 6/22 డివిజన్ ఏనుగొండలో ₹39.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నిర్మాణ పనులకు 22వ పద్మావతి కాలనీ వార్డులు 9.32 కోట్ల నిధులతో పనులకు శంకుస్థాపన చేశారు. బుధవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. నగర సమగ్ర అభివృద్ధిలో భాగంగా యూజీడీ వ్యవస్థను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు.

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వసతులు అందుబాటులోకి రానున్నాయి.

ఈ కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్.పి. వెంకటేష్, సిరాజ్ ఖాద్రీ, 22వ కార్పొరేటర్ జ్యోతి, అనుపటి రామస్వామితో పాటు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వార్తలు