హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో పసికందు మృతి.. ఆసుపత్రి సీజ్..!
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ ఓ ప్రైవేట్ బాలాజీ పవర్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకోగా ఉదయం వెలుగులోకి వచ్చింది.

హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో పసికందు మృతి.. ఆసుపత్రి సీజ్..!
కంగ్టి, మన సాక్షి :-
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ ఓ ప్రైవేట్ బాలాజీ పవర్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకోగా ఉదయం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రాసోల్ గ్రామానికి చెందిన బాబుకు జ్వరం రావడంతో సోమవారం తడ్కల్ లో బాలాజీ పవర్ హాస్పిటల్ కు తీసుకురావడంతో అక్కడ వైద్యం చేసినప్పటికీ జ్వరం తగ్గలేదని తెలిపారు.
మంగళవారం ఉదయం బాబును కంగ్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆర్ఎంపి వద్ద వైద్యం చేయించిన అనంతరం బాబు పరిస్థితి విషమించిందని, నిర్లక్ష్యంగా వైద్యం చేయడం వల్లే తమ బాబు మృతి చెందాడని కుటుంబం సభ్యులు ఆరోపిస్తున్నారు.
బాలాజీ పవర్ ఆసుపత్రి సీజ్
జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు మంగళవారం మండల వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగమణి తన బృందంతో కలిసి ఆసుపత్రిని పరిశీలించారు. బాలాజీ పవర్ ఆసుపత్రిలో సీఈఏ చట్టం నిబంధనలకు విరుద్దంగా కనీస వసతులు, వైద్య ప్రమాణాలు లేకుండా పేషంట్లకు వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు.
నిబంధనను ఉల్లంఘించిన బాలాజీ పవర్ ఆసుపత్రిని డాక్టర్ నాగమణి సీజ్ చేశారు.పసికందు కు వైద్యం అందించిన ఆర్ఎంపి పై చర్యల్లో భాగంగా సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని వెల్లడించారు.











