ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి పై కేసు నమోదు.. పోలీసుల గాలింపు..!
బాసింగా బలాలే ఫోక్ సాంగ్ తో ఫోక్ డాన్సర్ గా అత్యంత గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయిపై కేసు నమోదు అయింది. మరో ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ తో రూమ్ లో తన భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే.

ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి పై కేసు నమోదు.. పోలీసుల గాలింపు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
బాసింగా బలాలే ఫోక్ సాంగ్ తో ఫోక్ డాన్సర్ గా అత్యంత గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయిపై కేసు నమోదు అయింది. మరో ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ తో రూమ్ లో తన భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన విషయం తెలిసిందే.
తాజాగా అతనిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఈశ్వర్ సాయితో రూమ్ లో దొరికిన మాధురిని అతనిపై ఫిర్యాదు చేయడం గమనార్హం. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై మోసపూరిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈశ్వర్ సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని అదుపులో తీసుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
ALSO READ : నల్గొండ జిల్లాలో దారుణం.. మానసిక వికలాంగురాలుపై అత్యాచారం..!
ఈశ్వర్ సాయి భార్య శరణ్యకు వేములవాడలోని రెడ్డి భవన్ లో మరో ఫోక్ డాన్సర్ మాధురితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఆ తర్వాత తన భర్త మంచివాడేనని, మాధురి వల్లే అలా తయారయ్యాడని శరణ్య మీడియా ముందు కామెంట్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. అనంతరం శరణ్య తనను తీవ్రంగా కొట్టిందని, బూతులు తిడుతూ రెచ్చిపోయిందని వేములవాడ పిఎస్ లోనే మాధురి ఫిర్యాదు చేసింది.
ఇవి కూడా చదవండి