Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

Suryapet : అవినీతి సొమ్మును లెక్కించే పనిలో కాంగ్రెస్ నేతలు.. అడ్డంకులు సృష్టించి పోరుబాట..!

రాష్ట్రంలో నీటి సమస్యలు తీవ్రంగా మారుతున్నా ప్రభుత్వ పెద్దలు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అవినీతి సొమ్మును లెక్కించే పనిలో ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు.

Suryapet : అవినీతి సొమ్మును లెక్కించే పనిలో కాంగ్రెస్ నేతలు.. అడ్డంకులు సృష్టించి పోరుబాట..!

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, మనసాక్షి :

రాష్ట్రంలో నీటి సమస్యలు తీవ్రంగా మారుతున్నా ప్రభుత్వ పెద్దలు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అవినీతి సొమ్మును లెక్కించే పనిలో ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

కేసీఆర్‌ను తలచుకోవడంలో రేవంత్‌దే ఫస్ట్:

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నాయని జగదీశ్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అంటే అనుక్షణం భయంతోనే రేవంత్ రెడ్డి రోత మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను ఎక్కువగా గుర్తు చేసుకునే వారిలో రేవంత్ రెడ్డిదే ప్రథమ స్థానమని ఎద్దేవా చేశారు.

సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చారో లెక్క తీయడానికి సిద్ధమా?

రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి సచివాలయానికి ఎన్నిసార్లు వచ్చారో లెక్కలు తీయడానికి సిద్ధమా? అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.
వెలుగొండ ప్రాజెక్టుపై మాట్లాడే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు లేదని ప్రశ్నించారు. కళ్లముందే నీరు కనిపిస్తున్నా ఆ నీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తుంటే అడ్డుకోలేని పరిస్థితికి ప్రభుత్వ అసమర్థత, అవినీతే కారణమని ఆరోపించారు.

పాలమూరుకు ద్రోహం చేస్తున్న రేవంత్:

తనకు రాజకీయంగా ఎదగడానికి అవకాశం కల్పించిన మహబూబ్‌నగర్ జిల్లాకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు ప్రాంతంలో మళ్లీ వలసలు పెరగడానికి ప్రభుత్వ విధానాలే కారణమవుతున్నాయని ఆరోపించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అన్యాయం జరుగుతున్నా జిల్లా మంత్రులు నోరు మెదపడం లేదని మండిపడ్డారు.

రాష్ట్రంలోని అనేక పట్టణాలు, పల్లెల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 24 గంటల విద్యుత్, తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టామని, ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
కేసీఆర్‌కు ఎదురుగా వచ్చే దమ్ము నీకుందా?” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు.

రేపటి నుంచి పోరుబాట – మిర్యాలగూడలో కేటీఆర్ రైతు సభ:

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై రేపటి నుంచి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరుబాట ప్రారంభమవుతుందని జగదీశ్ రెడ్డి ప్రకటించారు. రైతాంగ సమస్యలు, వ్యవసాయ సంక్షోభంపై కేటీఆర్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో భారీ రైతు సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా సభను నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య, యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వై వెంకటేశ్వరరావు ఉప్పల ఆనంద్,మున్సిపల్ మాజీ చైర్మన్ అన్నపూర్ణ, గుర్రం సత్యనారాయణ రెడ్డి, జీడీ బిక్షం గాలి సాయి నెమ్మది బిక్షం, బురా బాల సైదులు గౌడ్, తహర్, బాషా, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు