Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

మిర్యాలగూడలో రైస్ మిల్లు అడ్డాగా.. రేషన్ బియ్యం పాలిష్ దందా.. ముగ్గురి అరెస్ట్..!

రైస్ మిల్లులు అడ్డగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రేషన్ బియ్యం తందా సాగుతోంది. పిడిఎస్ బియ్యంను కొనుగోలు చేసి రైస్ మిల్లులో పాలిష్ చేసి బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

మిర్యాలగూడలో రైస్ మిల్లు అడ్డాగా.. రేషన్ బియ్యం పాలిష్ దందా.. ముగ్గురి అరెస్ట్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

రైస్ మిల్లులు అడ్డగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రేషన్ బియ్యం తందా సాగుతోంది. పిడిఎస్ బియ్యంను కొనుగోలు చేసి రైస్ మిల్లులో పాలిష్ చేసి బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల ఓ రైస్ మిల్లులో నిలువ చేసిన పిడిఎస్ బియ్యం ను రూరల్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. కాగా మరోసారి రైస్ మిల్లులో నిల్వ ఉన్న పిడిఎఫ్ బియ్యం పట్టుకున్నారు.

ALSO READఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి పై కేసు నమోదు.. పోలీసుల గాలింపు..!

మిర్యాలగూడ రూరల్ పరిధిలోని వెంకటాద్రిపాలెం.. కేశవ నగర్ లో ఉన్న శ్రీ మారుతీ ట్రేడర్స్ శ్రీరామ బిన్నీ రైస్ మిల్లు వద్ద పిడిఎఫ్ దందా సాగుతున్న విషయాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. దందా నిర్వహిస్తున్న ముగ్గురుని అరెస్టు చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు రూరల్ పోలీసులు రైస్ మిల్లు వద్దకు చేరుకోగానే సుమారు 36 బస్తాలలో 18 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం వాహనంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడే ఉన్న కంచకూరి వెంకటేశ్వర్లు, మేళ్లచెరువు వెంకటరమణ, షేక్ మదర్ లను అరెస్టు చేశారు.

ALSO READ : హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో పసికందు మృతి.. ఆసుపత్రి సీజ్..!

వీరిలో కంచకూరి వెంకటేశ్వర్లు సమీప గ్రామాలలోని తెల్ల రేషన్ కార్డుదారుల నుండి పిడిఎస్ బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తాడు. కొనుగోలు చేసిన పిడిఎస్ బియ్యం ను తన రైస్ మిల్లుకు తరలించి పాలిష్ చేయించి ఇతర బస్తాల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తూ లాభం పొందుతున్నాడు. మిగతా ఇద్దరూ అతడికి గుమస్తాగా ఉంటూ రవాణాకు సహకరిస్తున్నారు. కాగా ముగ్గురిని అరెస్టు చేయడంతో పాటు బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు