మంత్రి కొండా సురేఖ భర్తరఫ్ కు రంగం సిద్ధం.. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వనుందా..!
మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్త్ రఫ్ చేసేందుకు రంగం సిద్దమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకోగానే బర్త్ రఫ్ లేఖ ను అతనికి అందించే అవకాశం ఉంది. మంత్రి పదవి నుంచి బిసి మహిళను తొలగించడం కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లుగా అధిష్టానం భావించి ముగ్గురు మహిళ బీసీ నేతలకు పదవులు ఇచ్చే అవకాశం ఉంది.

మంత్రి కొండా సురేఖ భర్తరఫ్ కు రంగం సిద్ధం.. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వనుందా..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్త్ రఫ్ చేసేందుకు రంగం సిద్దమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకోగానే బర్త్ రఫ్ లేఖ ను లోక్ భవన్ కు పంపించే అవకాశం ఉంది. మంత్రి పదవి నుంచి బిసి మహిళను తొలగించడం కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లుగా అధిష్టానం భావించి ముగ్గురు మహిళ బీసీ నేతలకు పదవులు ఇచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కొండా సురేఖ అమితుమీ తేల్చుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి మంత్రి కొండ సురేఖ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. కొండా సురేఖ వివాదం తో ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు హై కమాండ్ సిద్ధమైంది ఆమెను రాజీనామా చేయాలని ఐ కమాండ్ కోరినట్లు సమాచారం. గురువారం సాయంత్రం లోగా రాజీనామా చేయకుంటే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
అయితే ఇదిలా ఉండగా కొండ సురేఖ తను హై కమాండ్ వద్దకు వెళ్లినా ఆమెకు సహకారం అందలేదని తెలుస్తుంది. తనను భర్తరఫ్ చేస్తే ముందుగా రేవంత్ రెడ్డికి, తనపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని, తనకు నోటీసులు ఇవ్వడమే తప్పని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈరోజు సాయంత్రంలోగా కొండ సురేఖ రాజీనామా చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా సాయంత్రంలోగా కొండ సురేఖ తన ముఖ్య అనుచరులతో సమావేశం అయ్యి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. మంత్రి పదవికి రాజీనామా చేస్తే ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తదుపరి నిర్ణయం ఏంటనే విషయాన్ని ఆమె త్వరలో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తే ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేయనున్నట్లు సమాచారం.
ఆమె ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తే ఉప ఎన్నిక తప్పదు. అయితే ఆమె ఏ పార్టీ నుంచి తిరిగి భరిలో ఉంటుందనే విషయం ఆసక్తిగా ఉంది. ఉప ఎన్నిక వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందనే విషయంపై రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
MOST VIEWS
- రూ.39.4 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే యెన్నం శంకుస్థాపన..!
- Gold Price : వరుసగా పడిపోతున్న బంగారం ధరలు.. ఈరోజు తులం ఎంతంటే..!
- ఎరువుల పంపిణికి మరో కొత్త యాప్.. రేపటి నుంచి అమలులోకి.. ఇలా చేస్తేనే రైతుకు ఎరువులు..!
- Suryapet : అవినీతి సొమ్మును లెక్కించే పనిలో కాంగ్రెస్ నేతలు.. అడ్డంకులు సృష్టించి పోరుబాట..!









