Hyderabad :15 ఏళ్ల బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్ల సామూహిక లైంగిక దాడి
హైదరాబాద్ నగరంలోని పాత బస్తి పరిధిలో 15 సంవత్సరాల మైనర్ బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

Hyderabad :15 ఏళ్ల బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్ల సామూహిక లైంగిక దాడి
మన సాక్షి, వెబ్ డెస్క్:
హైదరాబాద్ నగరంలోని పాత బస్తి పరిధిలో 15 సంవత్సరాల మైనర్ బాలికపై ఇద్దరు ఆటో డ్రైవర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ ప్రాంతాలకు చెందిన 15 సంవత్సరాల బాలిక బర్కస్ లోని ఓ నివాసంలో సహాయకురాలిగా పనిచేస్తుంది. ఇంటి నుంచి విధులకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది.
కాగా బాలికపై అందులో ఉన్న ఆటో డ్రైవర్లు అహ్మద్, అస్లాం కన్నేశారు. బాలికను గమ్యస్థానానికి చేర్చకుండా పథకం ప్రకారం నిర్మానుష ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ అమానుష ఘటనపై తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేయగా వారు పోలీసులు ఆశ్రయించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చంద్రాయనగుట్ట పోలీసులు స్పందించి నిందితులు పై ఫోక్సో చట్టంతో పాటు సంబంధిత కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.









