Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్

పేదల పక్షాన నిలిచి ఆధిపత్య శక్తులను ఎదిరించిన వీరుడు.. పండుగ సాయన్న..!

పండుగ సాయన్న 174వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్‌లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు.

పేదల పక్షాన నిలిచి ఆధిపత్య శక్తులను ఎదిరించిన వీరుడు.. పండుగ సాయన్న..!

ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

(మహబూబ్ నగర్ టౌన్ – శ్రీశైలం, మన సాక్షి )

పండుగ సాయన్న 174వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్‌లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు.

పేద ప్రజల హక్కుల కోసం పోరాడి, నిరంకుశ పాలనను ఎదిరించిన పండుగ సాయన్న జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. నిజాం పాలన కాలంలో తెలంగాణలో సాగిన తిరుగుబాట్లు, ప్రజా ఉద్యమాల చరిత్రలో పండుగ సాయన్నకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఆనాటి దొరలు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు, అధికారుల దోపిడీకి వ్యతిరేకంగా నిలిచి పేద ప్రజలకు అండగా నిలిచిన ధీరుడు పండుగ సాయన్న అని కొనియాడారు.

Also Read : మహబూబ్ నగర్ జిల్లాలో సంచలనం.. భర్తను హత్య చేసిన భార్య..!

సంపన్న వర్గాల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, పేదలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఆయన పోరాటం సాగించారని పేర్కొన్నారు. తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న కేవలం సంపన్నుల నుంచి సంపదను తీసుకుని పేదలకు పంచిన వ్యక్తి మాత్రమే కాదని, ఆనాటి నిరంకుశ అధికార వ్యవస్థను సవాలు చేసి, ప్రజల కోసం ప్రత్యామ్నాయ పాలనా వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రయత్నించిన పోరాట యోధుడని ఆయన గుర్తుచేశారు.

సామాజిక అసమానతలు, ఆధిపత్య శక్తుల దోపిడీకి వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. అప్పటి ఆధిపత్య వర్గాల కుట్రల నేపథ్యంలో ఆయన ప్రాణాలు కోల్పోయినప్పటికీ, వారి పోరాట స్ఫూర్తి ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందని పేర్కొన్నారు.

తరతరాలుగా జానపద కళాకారులు, 12 మెట్ల కిన్నెరపై వీరోచిత గాథలను ఆలపించే కళాకారులు పండుగ సాయన్న చరిత్రను ప్రజలకు చేరవేస్తున్నారని తెలిపారు. ఆయన జీవితం, పోరాటం, త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం ఆయన చూపిన ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు జ్యోతి, షబ్బీర్ అహ్మద్, ఉమర్ కొత్వాల్, రమేష్ రెడ్డి అవేజ్, రమేష్ బాబు నాయకులు రాజేందర్ రెడ్డి, గట్టు వెంకట్ రెడ్డి,

Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భవాని భక్తులు మృతి..!

నాచా శ్రీనివాస్, మైత్రి యాదయ్య,‌ మున్నూరు రవి, నేహా శ్రీ, గుమ్మాల శ్రీనివాస్, వెంకట నర్సయ్య, వర్దరవి , ఉమ్మడి జిల్లా ముదిరాజ్ సభ కన్వీనర్ మెట్టుకాడి శ్యాం, చందు యాదవ్, అబ్దుల్ హక్, రాచాల మురళి, తుప్పలి ఆంజనేయులు, సేవదల్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు