నగరంలో భారీ శబ్దాలు.. భయభ్రాంతులకు గురై జనం పరుగులు..!
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దాలతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

నగరంలో భారీ శబ్దాలు.. భయభ్రాంతులకు గురై జనం పరుగులు..!
మన సాక్షి, వెబ్ డేస్క్ :
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దాలతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఉదయం 9:15 గంటల ప్రాంతంలో రాజేంద్రనగర్, ఉప్పర్ పల్లి, అత్తాపూర్, ఎర్రబోడ, లంగర్ హౌస్, కేశవ స్వామి నగర్ ప్రాంతాలలో భారీ శబ్దాలు వినిపించాయి. ఆ భారీ శబ్దాలతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
Also Read : క్యాప్ కోసం వెళితే.. ప్రాణమే పోయింది.. పెద్ద అంబర్పేట్ లో నల్గొండ యువకుడు మృతి..!
అయితే ఈ శబ్దంతో భూకంపం వచ్చిందేమో అని ఇళ్లలో నుంచి ప్రజలు పలు ప్రాంతాలలో బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాలలో రహదారులు జనంతో నిండిపోయి. తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటనపై పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఏంటి..? అని ఆరా తీస్తున్నారు. ఖచ్చితమైన వివరాలను తెలుసుకునేందుకు క్లూస్ టీం బృందాలు కూడా రంగంలోకి దిగాయి.









