హైడ్రామా.. పక్కా ప్లాన్.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్..!
హై డ్రామా.. పక్కా ప్లాన్ తో పోలీసుల కన్నుగప్పి ఏకంగా 17 మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తేని జిల్లా సబ్ జైల్లో చోటుచేసుకుంది.

హైడ్రామా.. పక్కా ప్లాన్.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
హై డ్రామా.. పక్కా ప్లాన్ తో పోలీసుల కన్నుగప్పి ఏకంగా 17 మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తేని జిల్లా సబ్ జైల్లో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఖైదీల పరారీ ఘటన తీవ్ర సంచలనంగా మారింది.
రాత్రి సమయంలో ఖైదీ తనకు ఫీట్స్ వచ్చినట్లుగా నటిస్తూ గట్టిగా కేకలు వేశాడు. అది నిజమని నమ్మిన జైలు సిబ్బంది ఏమాత్రం ఆలోచించకుండా తలుపులు తీసి లోపలికి వెళ్లారు. అంతే లోపల కాపు కాచుకొని ఉన్న ఖైదీలంతా ఒక్కసారిగా సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. జైలు ప్రాంగణం నుంచి బయట పరుగులు తీశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జైలు సిబ్బందిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
Also Read : తుమ్మిడిహెట్టి పెంపుకు గ్రీన్ సిగ్నల్.. రేవంత్ రెడ్డి, ఫడ్నవీస్ భేటీ సక్సెస్..!
జైలు వెనక దట్టమైన అడవి ఉండడంతో అడవిలో పారిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు తేని, దిండిగల్ సరిహద్దు ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించారు. చెక్ పోస్ట్ లను రాత్రికి రాత్రే కూంబింగ్ ఆపరేషన్ కూడా ప్రారంభించారు. పారిపోయిన 17 మంది ఖైదీలలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లుగా సౌత్ ఐజీ విజయేంద్ర బిదారి వెల్లడించారు. మిగిలిన 13 మంది ఖైదీల కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.









