Miryalaguda : మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకై ఎమ్మెల్సీలకు వినతి..!
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు సమస్యను రానున్న శాసన మండలి సమావేశంలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి జిల్లా సాధన కోసం తమ వంతు కృషి చేస్తామని శాసన మండలి సభ్యులు, ఆదివాసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, శాసన సభ హామీల అమలు కమిటీ చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ కోటిరెడ్డిలు అన్నారు.

Miryalaguda : మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకై ఎమ్మెల్సీలకు వినతి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు సమస్యను రానున్న శాసన మండలి సమావేశంలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి జిల్లా సాధన కోసం తమ వంతు కృషి చేస్తామని శాసన మండలి సభ్యులు, ఆదివాసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, శాసన సభ హామీల అమలు కమిటీ చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ కోటిరెడ్డిలు అన్నారు.
ఆదివారం ఆయా ఎమ్మెల్సీలకు మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా ఏర్పాటు విషయమై వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు జిల్లాల పునర్విభజనలో ముఖ్యమైనదని అయిన జిల్లా ఏర్పాటు కాకపోవడంతో మిర్యాలగూడ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరలేదని అన్నారు.
ఇప్పటికీ మరోమారు కొత్త జిల్లాల ఏర్పాటు తెరమీదికి రావడంతో మిర్యాలగూడ ప్రజల్లో ఆశలు చిగురించడం సహజమని సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. జిల్లా ఏర్పాటుకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారని, అన్ని అర్హతలు, అవకాశాలు జిల్లా ఏర్పడేందుకు మిర్యాలగూడ అవకాశం ఉందని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నాయకులు సీనియర్ అడ్వకేట్ శ్రీధర్, రాపోలు పరమేష్, తమ్మడ బోయిన అర్జున్, దాసరాజు జయరాజు, మాలోతు దశరథ్ నాయక్, చేగొండి మురళి యాదవ్, మహిమూద్, మక్ల నాయక్, విజయ్ నాయక్, బిచ్య నాయక్, కృష్ణా నాయక్,వెంకట్, రాములు తదితరులు పాల్గొన్నారు.










