Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Breaking : నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత, పల్నాడు వాటర్ గ్రిడ్ వద్ద రణరంగం..!

కృష్ణా జలాల విషయం లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మరోసారి ఉద్రిక్తత రాజుకుంది. నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు రాజకీయ వివాదానికి కేంద్రబిందువుగా మారాయి.

Breaking : నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత, పల్నాడు వాటర్ గ్రిడ్ వద్ద రణరంగం..!

తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలపై ప్రైవేటు వ్యక్తుల దాడి

మహిళా నేతలకూ తప్పని దాడులు, పోలీసుల సమక్షంలోనే ఘటన

ఆందోళనకారులను అరెస్ట్ చేసి విజయపురి పోలీస్ స్టేషన్‌కు తరలించిన ఏపీ పోలీసులు

–తెలంగాణ నీటి హక్కుల కోసం ఎంతటి పోరాటా నికైనా సిద్ధమన్న టీఆర్ఎస్ నాయకులు

–నాయకులపై దాడి దుర్మార్గమని కల్వకుంట్ల కవిత తీవ్ర ఖండన

నాగార్జునసాగర్, మన సాక్షి :

కృష్ణా జలాల విషయం లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మరోసారి ఉద్రిక్తత రాజుకుంది. నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు రాజకీయ వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. తెలంగాణ నీటి హక్కులకు భంగం కలుగు తుందంటూ తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యక ర్తలు ఆదివారం ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగారు. అ యితే ఈ నిరసన కాస్తా ఘర్షణకు దారితీసింది. ప్రైవే టు వ్యక్తులు ఆందోళనకారులపై కర్రలు, దుంగలతో దా డికి దిగడం, మహిళా నాయకులపైనా దాడి జరగడం కలకలం రేపింది.

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తర లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ ర క్ష ణ సేన నాయకులు ఆరోపించారు. ఈ ప్రాజెక్టు తెలం గాణ సాగునీటి ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంద ని పేర్కొంటూ పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్ వద్దకు చేరుకున్న నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్రాజెక్టు పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడికి వచ్చిన కొందరు ప్రైవేటు వ్యక్తులు ఒక్కసారిగా ఆందోళనకారులపై దాడికి దిగిన ట్లు నాయకులు ఆరోపించారు. కర్రలు, దుంగలతో దాడి చేయడంతో పాటు మహిళా నాయకులపైనా దాడి జ రి గినట్లు తెలిపారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

దాడి జరిగినా.. ఆందోళనకారులే అరెస్టులు

ప్రైవేటు వ్యక్తుల దాడితో ప్రాజెక్టు ప్రాంతంలో ఉద్రిక్త పరి స్థితులు నెలకొన్నాయి. అనంతరం ఏపీ పోలీసులు ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన నాయకు లు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని విజయపురి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా తమనే అరెస్టు చేయడంపై తెలంగాణ రక్షణ సేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్నాడు ప్రాజెక్టు వద్దకు వెళ్లడానికి ముందు తెలంగాణ రక్షణ సేన నాయకులు నాగార్జునసాగర్ రైట్ కెనాల్ వద్ద కూడా ఆందోళన చేపట్టారు. ఏపీ నీటి తర లింపును అడ్డుకోవాలని, తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

‘మా నీళ్లు మాకు కావాలి.. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దు’ అంటూ నినదించారు. తెలంగాణ రైతులకు సాగునీరు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో ఏపీకి నీటిని తరలించే ప్రయత్నాలను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న నాయకులను సీఐఎస్ఎఫ్ పోలీసులు చెదరగొట్టారు.

గురుదక్షిణగా తెలంగాణ ప్రయోజనాలా?

తెలంగాణకు ఆంధ్రా పాలకుల కంటే ఇక్కడి రాజకీయ పార్టీల నాయకులే ఎక్కువ నష్టం చేస్తున్నారని టీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్ విమ ర్శించారు. ఏపీ నీటి తరలింపును ప్రశ్నించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, కేంద్రంలోని బీజేపీ కూడా సహకరిస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. అవసరమైతే తెలంగాణ ఉద్యమం తరహాలో మరో పోరాటం చేపడతామని హెచ్చరించారు.

రైతులకు సాగునీరు అందించలేని పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి పద విలో కొనసాగడం ఎందుకని ప్రశ్నించారు.ఏపీ తెలం గాణ నీటిని తరలిస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని టీఆర్ఎస్ యూత్ స్టేట్ ప్రెసి డెంట్ కంచర్ల శివారెడ్డి నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాల ను పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్‌కు నీటిని అందించే ప్రయత్నాలను సహించేది లేదన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణ పాఠం చెబుతారని హెచ్చరించారు.

నీళ్ల సోయి లేని సీఎం.. రాజీనామా చేయాలి

తెలంగాణలో సాగునీటి కొరత ఉందంటూ పంటల సాగుపై ఆంక్షలు విధించే పరిస్థితి ఉంటే, మరోవైపు ఏపీ కృష్ణా జలాలను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయ త్నాలు చేస్తోందని టీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు విక్రాంత్ రెడ్డి విమర్శించారు. కృష్ణా బేసిన్‌కు దూరంగా ఉన్న ప్రాంతాలకూ నీటిని తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల ప్రయో జనాలను కాపాడలేని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కృష్ణా జలాలపై హక్కులు కాపాడాలి

ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం జరుగుతూనే ఉందని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొడ్డుపల్లి లింగం ఆరోపించారు. కృష్ణానది పై నిర్మిస్తున్న వివిధ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ నీటి వాటాకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం నుంచి తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించిన తీరును ప్రస్తావిస్తూ, ఇప్పుడు నాగార్జునసాగర్ వద్ద పల్నాడు వాటర్ గ్రిడ్ పేరుతోనూ భవిష్యత్తులో నీటి తరలింపు పెరిగే ప్రమాదం ఉందని అన్నా రు. కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ నిర్ణయాలు, నిబంధ నలకు అనుగుణంగానే ప్రాజెక్టులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

మహిళా నాయకులపై దాడి దుర్మార్గం: కవిత

పల్నాడు వద్ద తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్య కర్తలపై జరిగిన దాడిని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాయకులపై, ముఖ్యంగా మహిళా నాయకులపై పోలీసుల సమక్షంలోనే ప్రైవేటు వ్య క్తులు దాడి చేయడం దుర్మార్గమని ఆమె ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగించే ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అరెస్టు చేసిన తమ పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మొత్తంగా.. నాగార్జునసాగర్ నీటి వివాదం మరోసారి తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టించింది. పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు, తెలంగాణ నీటి హక్కులు, నాయకులపై దాడి, అరెస్టుల వ్యవహారం రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని మరింత తీవ్రతరం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, నీటి హక్కుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు