వైస్ ఎంపీపీగా భర్త.. సర్పంచ్ గా భార్య ఏకగ్రీవం..!
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో టిడిపి యువ నాయకుడు రూపేష్ రెడ్డి పట్టు నిలుపుకుంటున్నాడు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మాలేనత్తం గ్రామపంచాయతీ నుండి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు.

వైస్ ఎంపీపీగా భర్త.. సర్పంచ్ గా భార్య ఏకగ్రీవం..!
BY : VENUGOPAL RAJU
రామసముద్రం, మనసాక్షి : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో టిడిపి యువ నాయకుడు రూపేష్ రెడ్డి పట్టు నిలుపుకుంటున్నాడు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మాలేనత్తం గ్రామపంచాయతీ నుండి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. స్థానిక కూటమి నాయకులు రూపేష్ రెడ్డిని రామసముద్రం వైస్ ఎంపీపీ గా ఎన్నుకున్నారు.
ఇప్పుడు సర్పంచ్ గా ఇతని సతీమణి హరిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాలేనత్తం గ్రామపంచాయతీ నుండి కూటమి తరపున సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వీరి ప్రజాబలం ముందు గెలవలేమని గుర్తించిన ప్రతిపక్ష పార్టీలు సర్పంచ్ బరి నుండి తప్పుకున్నారు. దీంతో ఎన్నికల అధికారులు హరితను ఏకగ్రీవ సర్పంచ్ గా ప్రకటిస్తూ ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
ఇలా నెల రోజుల వ్యవధిలోనే వైస్ ఎంపీపీగా రూపేష్ రెడ్డి, ఏకగ్రీవ సర్పంచ్ గా తన సతీమణి హరిత ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఈయన అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగి తేలారు. ఒకే ఇంటిలో రెండు ముఖ్యమైన పదవులు దక్కడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.
మాలేనత్తం గ్రామపంచాయతీలో రూపేష్ రెడ్డి రాజకీయంగా పట్టు సంపాదించుకున్నారు. వీరిద్దరి గెలుపు కోసం పంచాయితీలో ఉన్న టిడిపి, జనసేన, బిజెపి ముఖ్య నాయకులు ఎంతో తీవ్రంగా శ్రమించారు. తమ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి రూపేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.










