Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం

కాప్పల్లె సర్పంచ్ కూటమి అభ్యర్థిగా బరిలో లోకనాథ్ రాజు..!

రామసముద్రం మండలం కాప్పల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం - కూటమి అభ్యర్థిగా లోకనాథ్ రాజు పోటీ చేస్తున్నారు

కాప్పల్లె సర్పంచ్ కూటమి అభ్యర్థిగా బరిలో లోకనాథ్ రాజు..!

రామసముద్రం, మనసాక్షి : రామసముద్రం మండలం కాప్పల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం – కూటమి అభ్యర్థిగా లోకనాథ్ రాజు పోటీ చేస్తున్నారు. గ్రామ అభివృద్ధే ధ్యేయంగా, ప్రజా సేవే లక్ష్యంగా బరిలోకి దిగిన లోకనాథ్ కి మంచం గుర్తు కేటాయించబడింది.ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మీ అమూల్యమైన ఓటును మంచం గుర్తుపై వేసి తనను గెలిపించాలని ప్రార్థించారు.

Also Read : వైస్ ఎంపీపీగా భర్త.. సర్పంచ్ గా భార్య ఏకగ్రీవం..!

తనను గెలిపిస్తే గ్రామంలోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, మహిళల సంక్షేమం, పేదల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు అందరూ లోకనాథ్ రాజు గెలుపు కోసం సమన్వయంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. కురిజలలో కూటమికి రోజురోజుకూ మద్దతు పెరుగుతోందని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు