బట్టలు ఆరవేస్తుండగా కరెంట్ షాక్.. మహిళ దుర్మరణం..!
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన గుర్రంపోడు మండలం సుల్తాన్ పురం గ్రామంలో చోటుచేసుకుంది.

బట్టలు ఆరవేస్తుండగా కరెంట్ షాక్.. మహిళ దుర్మరణం..!
BY : YALADRI, GURRAMPODU
గుర్రంపోడు, మన సాక్షి :
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం సుల్తాన్ పురం గ్రామంలో చోటుచేసుకుంది. సుల్తాన్ పురం గ్రామానికి చెందిన ఏలుకొండ వెంకటమ్మ (48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంత్రం సుమారు 6:00 గంటల సమయంలో ఆమె తన ఇంటి ముందు కట్టిన ఇనుప తీగపై బట్టలు ఆరవేసే క్రమంలో ప్రమాదవశాత్తు ఆ ఇనుప తీగకు విద్యుత్ సరఫరా రావడంతో వెంకటమ్మకు తీవ్రమైన కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఆమె ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయారు.
Also Read : ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అధికారులు.. ఇద్దరి అరెస్ట్..!
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటమ్మ మరణంతో ఆమె కుటుంబంలో, గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై మృతురాలి భర్త ఏలుకొండ ఈదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుర్రంపోడు ఎస్ఐ వెంకన్న తెలిపారు.









