Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుమహబూబ్‌నగర్

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..! 

జడ్చర్ల సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి..! 

మహబూబ్‌నగర్ జిల్లా, మన సాక్షి

జడ్చర్ల సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. జడ్చర్ల మండలం, 44వ జాతీయ రహదారి (కావేరమ్మ పేట శివారు ప్రాంతంలో వేగంగా వచ్చిన లారీ ముందున్న వాహనాన్ని ఢీకొనడంతో వరుసగా బొలెరో, కారు, ద్విచక్ర వాహనం పరస్పరం ఢీకొన్నట్లు సమాచారం.

ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. బాలనగర్ మండలం చిన్న రేవులి గ్రామానికి చెందిన నర్సింహ, శారద దంపతులు జడ్చర్లలోని గురుకుల పాఠశాలలో ఉన్న తమ కూతురిని చూడటానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, శారద మృతి చెందగా నర్సింహకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు.

ప్రమాదం కారణంగా రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

BY : GOPAL, MAHABUBNAGAR

మరిన్ని వార్తలు