Rythu Bharosa : రైతు భరోసా, రైతు బీమా పై కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా, రైతు బీమా పై కీలక నిర్ణయం.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, రైతు బీమా పథకంపై కీలక నిర్ణయం తీసుకోనున్నది. రాష్ట్ర మంత్రి మండలి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో రైతు భరోసా పై చర్చించనున్నారు. 2025 జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
కాగా యాసంగి సీజన్ లో ఇప్పటివరకు నాలుగు ఎకరాలలోపు పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే ఒక విడత ఎకరానికి 6000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేసింది. నాలుగు ఎకరాలపైగా ఉన్న రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు.
క్యాబినెట్ సమావేశంలో పెండింగ్లో ఉన్న రైతు భరోసాతో పాటు వానాకాలం సీజన్ కు గాను రైతు భరోసా నిధుల సమీకరణ పై చర్చించనున్నారు. దాంతో పాటు రైతు బీమా పథకానికి నిధుల సమీకరణంపై చర్చించే అవకాశాలున్నాయి.
అదే విధంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈరోజు నాలుగు గంటలకు క్యాబినెట్ సమావేశమై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నది. క్యాబినెట్ సమావేశం లో ఏం నిర్ణయాలు తీసుకుంటారనే విషయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. లంచం అడిగిన డాక్టర్ సస్పెండ్..!
-
Minister Ponguleti : ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!
-
WhatsApp : వాట్సాప్ లోకి అనుకున్న సరికొత్త ఫీచర్..!
-
Ration Cards : రేషన్ కార్డుదారులకు ఊహించని షాక్.. వారి కార్డులు రద్దు..!
-
Rythu Bharosa : వారికే ఒకేసారి రైతు భరోసా.. ఎప్పుడో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!









