A man died : చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..!

చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి చిన్న చెరువులో పడి మృతి చెందిన ఘటన గురువారం తడ్కల్ లో చోటుచేసుకుంది.

A man died : చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి..!

కంగ్టి,,, మన సాక్షి :-

చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి చిన్న చెరువులో పడి మృతి చెందిన ఘటన గురువారం తడ్కల్ లో చోటుచేసుకుంది. ఎస్సై విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ గ్రామానికి చెందిన బోయి గంగారం (35) చేపలు పట్టేందుకు వెళ్లి బుధవారం రాత్రి ఇంటికి తిరిగి రాలేదు.

గురువారం తడ్కల్ గ్రామ శివారులో ఉన్న చిన్న చెరువులో శవమై తేలినట్లు తమ్ముడు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య మహేశ్వరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.మృతుని భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : Tunnels in Hyderabad : హైదరాబాద్ లో భూగర్భ రోడ్లు.. సీఎం రేవంత్ ఆదేశాలు..!