Nalgonda : మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు అరెస్ట్..!

Nalgonda : మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు అరెస్ట్..!
నల్లగొండ, మన సాక్షి :
నల్లగొండ పట్టణములో 2 టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని షంషు నగర్ లో మైనర్ బాలికపై మంగళవారం అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేరస్తులైన గడ్డం కృష్ణ బచ్చలకూరి మధు లను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక ఆటో, ఒక పల్సర్ బైక్, రెండు సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నామన్నారు.
నల్లగొండ పట్టణముకు సమీపములోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికను నేరస్థుడు గడ్డం కృష్ణ, గత 3 నెలల క్రితం మైనర్ బాలిక యొక్క గ్రామములొ ట్రాక్టర్ డ్రైవరు గా పనిచేయుటకు వెళ్ళి ఆమెతో పరిచయము పెంచుకొని మాయమాటలు చెప్పి, ప్రేమ పేరుతో దగ్గరై, ఇన్స్టాగ్రామ్ ద్వార చాట్ చేసేవాదానితెలిపారు.
ఈనెల 7వ తేదీ ఉదయం 8 గంటల సమయములో మైనర్ బాలిక తన గ్రామం నుండి కాలేజీకి అదే ఊరికి చెందిన రెగ్యులర్ గా వెళ్ళే ఆటొ లో బయలుదేరి నల్లగొండ కు రాగా మైనర్ బాలికను డీఈవోఆఫీసు సమీపములో గడ్డం కృష్ణ బైక్ పై వచ్చి, తన బైక్ పై ఎక్కించుకొని వెళ్ళితే ఎవరైనా చూస్తారని తన స్నేహితుడైన బచ్చలకూరి మధు సహకారముతో అమ్మాయి ని మధు యొక్క ఆటొ లో ఎక్కించి షంషు నగర్, రోడ్ నెంబర్-8 లో గల మధు కిరాయికి తీసుకున్న రూమ్ దగ్గరకు తీసుకొని వెళ్ళి మధును పంపించి రూమ్ లో మైనర్ బాలికను బలవంతముగా, శారీరకముగా కలిసినాడు.
ఆ సమయములో బాలికకు తీవ్ర రక్త స్రావము అయి ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోయినదని తెలిపారు. అది చూసి వెంటనే కృష్ణరూమ్ కు తాళం వేసి పారిపోయి తనకు తెలిసిన వ్యక్తి కి సమాచారం ఇవ్వగా, అతను పోలీసులకు తెలిపినట్లు తెలిపారు. తరువాత మంగళవారం సాయంత్రం నేరస్థుడు కృష్ణపోలీసు స్టేషన్ లో తాను చేసిన నేరం ఒప్పుకొని లొంగిపోయి నట్లు డిఎస్పి తెలిపారు.
తరువాత ఆటో డ్రైవర్ మదును కూడ అదుపులోకి తీసుకొని పూర్తి విచారణ చేసి నట్లు డిఎస్పి తెలిపారు. ఇట్టి కేసును త్వరితగతిన పరిశోధన పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసి నేరస్థుస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేయడం జరుగుతుందనీ చెప్పారు.
ఇట్టి కేసును నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో వేగవంతముగా దర్యాప్తు చేసిన సిఐ-టూ టౌన్ ఎస్. రాఘవ రావు, సిఐ-వన్ టౌన్ ఏ. రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐ టూటౌన్ వై. సైదులు మ సిబ్బందిని జిల్లా ఎస్‌పి శరత్ చంద్ర పవర్ ఐపిఎస్ అబినందించినారు.
MOST READ :
-
TG News : తెలంగాణలో మంత్రుల మద్య వివాదం ముగిసిందా.. పొన్నం ఏం చెప్పారు..!
-
ACB : డ్రగ్ కంట్రోల్ ఆఫీసులో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ దొరికిన అధికారులు..!
-
Bike Driving : బైక్ నడిపేవారికి గుడ్ న్యూస్.. వెన్నునొప్పి తగ్గించే రహస్యాలు..!
-
Special Story : శాఖాహారుల ప్రోటీన్ వంటకం.. రుచులను ఆస్వాదించండి.. ప్రత్యేక కథనం..!









