Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో ఆంధ్ర ప్రదేశ్ వాసి మృతి..!

Miryalaguda : మిర్యాలగూడలో ఆంధ్ర ప్రదేశ్ వాసి మృతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ రూరల్ ఎస్సై లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా చిన్న గంజాం గ్రామానికి చెందిన షేక్ ఉస్మాన్ అలీ (37) మిర్యాలగూడ మండలం తుంగపాడు శివారులోని సంగం డైరీలో కూలీ పనులు చేస్తున్నాడు.

మిగతా ఆ గ్రామానికి చెందిన నలుగురితో కలిసి వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నాడు. మృతుడు మద్యానికి బానిసై బాగా మద్యం సేవించేవాడు. గత నాలుగు రోజుల నుండి భోజనం చేయకుండా మద్యం తాగాడు. ఈనెల 2వ తేదీన ఇంటికి వెళ్తున్నానని తోటి వాళ్లతో చెప్పి వెళ్లిపోయాడు.

కాగా గురువారం మధ్యాహ్నం సామ్య తండా కు వెళ్లే రోడ్డు దగ్గర్లో బీడు భూములు మృతి చెందాడు. తోటి కూలీలు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. మృతుడు కుటుంబ సభ్యులకు గత రెండు సంవత్సరాలుగా వేరుగా ఉంటున్నాడు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు