Bus Accident : ఘోర ప్రమాదం.. దగ్దమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. 20 మందికి పైగా మృతి..!

Bus Accident : ఘోర ప్రమాదం.. దగ్దమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. 20 మందికి పైగా మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సుకు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఘోరం ప్రమాద సంఘటన చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేది 20 మందిపైగా మృతి చెందారు. శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైకును ఢీ కొట్టింది.
దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఆ మంఫలు బస్సు మొత్తం మంటలు వ్యాపించడంతో భారీ ప్రమాదం సంభవించింది. అంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడం వల్ల ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమర్జెన్సీ డోర్ నుంచి సుమారు 20, 25 మంది బయటపడినట్లు సమాచారం. కాగా 20 మంది పైన దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కొంతమందిని కర్నూలు జి జి హెచ్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కర్నూలు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం pic.twitter.com/3IDtQyZOAY
— Mana Sakshi (@ManaSakshiNews) October 24, 2025
MOST READ :
-
District collector : చేనేత ఎక్స్ లెన్స్ సెంటర్ నిర్మాణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
-
PDS : అక్రమంగా రేషన్ బియ్యం రవాణా.. మహిళ అరెస్ట్, 20 క్వింటాళ్లు స్వాధీనం..!
-
Gold Price : బంగారం ధరలు ఒకేసారి ఢమాల్.. ఒక్కరోజే రూ.33,800 తగ్గింది..!
-
Kisan App : పత్తి అమ్ముకునేందుకు కిసాన్ కాపస్ యాప్ తప్పనిసరి.. రైతులకు అవగాహన కల్పించిన అధికారులు..!









