Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : చేనేత ఎక్స్ లెన్స్ సెంటర్ నిర్మాణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

District collector : చేనేత ఎక్స్ లెన్స్ సెంటర్ నిర్మాణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నవంబర్ నెలాఖరు నాటికి చేనేత ఎక్స్ లెన్స్ సెంటర్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రం పక్కన కొనసాగుతున్న చేనేత ఎక్స్ లెన్స్ సెంటర్ నిర్మాణ పనులను గురువారం ఆమె స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ తో కలిసి పరిశీలించారు.

డోర్స్, లైటింగ్, టాయిలెట్ బ్లాక్, సెంటర్ చుట్టూ ప్రహరీ పనులను చూసి మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సెంటర్ నమూనా మ్యాప్ ను చూశారు. నవంబర్ నెల చివరి వరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. టెస్కో ఓ ఎస్ డీ హైదరాబాద్ రతన్ కుమార్,, మహబూబ్ నగర్ చేనేత జౌళి శాఖ ఏడి తో సెంటర్ పురోగతి పై చర్చించారు.

ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెలాఖరునాటికి భవన నిర్మాణ పనులు పూర్తి కావాలని ఆమె తేల్చి చెప్పారు. కార్యక్రమంలో టి జి ఎం ఎస్ ఐ డి సి ఈఈ రవీందర్,ఏ ఈ సాయి మురారి, నారాయణ పేట చేనేత జౌళి శాఖ ఏడి బాబు, ఆర్కిటెక్చర్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.

MOST READ : 

  1. Gold Price : బంగారం ధరలు ఎవరు నిర్ణయిస్తారో.. ఎలా నిర్ణయిస్తారో తెలుసా..!

  2. Accident : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై ఘోర ప్రమాదం.. బైకును ఢీ కొట్టిన ట్రాక్టర్, ఇద్దరు కొడుకులు మృతి..!

  3. TG News : టోల్ ప్లాజా వద్ద అర్దరాత్రి కారు పల్టీ.. తనిఖీ చేయగా షాక్ తిన్న పోలీసులు..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేద ప్రజలకు మరో భారీ శుభవార్త..!

మరిన్ని వార్తలు