ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ఏడీఈ..!
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ఏడీఈ..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
హైదరాబాద్ లోని ఎలక్ట్రిసిటీ గచ్చిబౌలి డివిజన్ ఏడీఈ సతీష్ కుమార్ రూ.70 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఎలక్ట్రిసిటీ ఆఫీసులో ఏసీబీ ఆఫీసర్స్ తనిఖీలు కొనసాగిస్తున్నారు. కాగా, ఓ పని కోసం వచ్చిన వ్యక్తిని ఏడీఈ సతీష్ కుమార్ లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.ఈ క్రమంలోనే శుక్రవారం పక్కా ప్లానింగ్ ప్రకారం సతీష్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఇటీవల ఏసీబీ అధికారులు మరింత దూకుడు పెంచారు. లంచగొండి అధికారుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. లంచం అనే మాట వినబడితే చాలు వెంటనే అక్కడ వాలిపోయి. లంచం తీసుకుంటున్న వారిపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఏసీబీ దూకుడు అధికారులు లంచాలు తీసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.
MOST READ :
-
Suryapet : పెద్దగట్టు జాతరకు 60 ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి..!
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. మెడికల్ ఆఫీసర్, సిబ్బందికి మెమొలు.. వాచ్ మెన్ తొలగింపు..!
-
Khammam : ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 8మందికి తీవ్ర గాయాలు..!
-
Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తు చేసుకున్నారా.. వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!









