Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం
Vemulapally : సర్పంచిగా బాధ్యతలు స్వీకరణ..!

Vemulapally : సర్పంచిగా బాధ్యతలు స్వీకరణ..!
వేములపల్లి, మన సాక్షి :
మండలంలోని రావులపెంట గ్రామ సర్పంచిగా సందరబోయిన చంద్రయ్య బాధ్యతలు స్వీకరించారు. సోమవారం గ్రామ స్పెషల్ ఆఫీసర్ కిషోర్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచిగా చంద్రయ్య,ఉప సర్పంచ్ గా గోవర్ధన్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రయ్య మాట్లాడుతూ… గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
మొదటగా ఆమనగల్ శ్రీశ్రీపార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు.అనంతరం రాత్రి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీ, మాజీ ఉపసర్పంచ్,పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.
MOST READ
-
Nalgonda : జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొనే విధంగా ఎదగాలి.. బహుమతులను అందజేసిన జిల్లా కలెక్టర్..!
-
Sarpanch : ఆపద వస్తే ఆదుకుంటా.. నూతన సర్పంచ్ ఆర్థిక సహాయం..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!
-
Online App : ఇక యూరియా కావాలంటే ఆన్ లైన్ యాప్ లో బుక్ చేసుకోవాల్సిందే.. ప్రారంభించిన జిల్లా కలెక్టర్..!









